Political News

జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: షర్మిల

అదానీతో విద్యుత్ ఒప్పందం, లంచం వ్యవహారాలపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సెకీకి మధ్య జరిగిందని జగన్ అన్నారు. తక్కువ ధరకే విద్యుత్ కొన్న తనను పొగిడి శాలువా కప్పి అవార్డు ఇవ్వాల్సింది పోయి అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జగన్ కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అని జగన్ కు షర్మిల సవాల్ విసిరారు.

అబద్ధాలను అందంగా అల్లడంలో జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇచ్చి శాలువా కప్పాలని సెటైర్లు వేశారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రూ 2.49 పైసలకు యూనిట్ కొనే సమయంలో సెకీ అమ్ముతోన్న విద్యుత్ గరిష్ట ధర రూ.2.16 అని, ఎక్కువ పెట్టి కొన్నందుకు శాలువలు కప్పాలా? అని ప్రశ్నించారు. గుజరాత్ యూనిట్ రూ 1.99 పైసలకే యూనిట్ కొన్న సమయంలో 50పైసలు ఎక్కువ పెట్టి ఏపీ కొన్నందుకు సన్మానం చేయాలా అని నిలదీశారు.

ఏ రాష్ట్రం అదానీతో ఒప్పందానికి ముందుకు రాని సమయంలో ఆఘమేఘాల మీద ఏపీ ఒప్పందం చేసుకుందని, అందుకు జగన్ కు అవార్డులు ఇవ్వాలా ? అని ఎద్దేవా చేశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్ఠంగా యూనిట్ కు రూ.1.70 పైసలు పడతాయని ఇంధన శాఖ చెబుతోందని, ఎటువంటి ఛార్జీలు లేవని జగన్ చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధం కాదా? అని నిలదీశారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత ఎందుకు పాటించారో చెప్పాలని ప్రశ్నించారు.

అదానీతో జగన్ ఒప్పందం అంతర్జాతీయ స్కామ్ అని,1750 కోట్లు సీఎంకు ముడుపులు ఇవ్వడం చరిత్ర అని అన్నారు. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం, అర్ధరాత్రి ఫైళ్లు పంపడం, హడావిడిగా కేబినెట్ లో ఆమోదింపజేయడం చరిత్ర అని చురకలంటించారు. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని జనంపై మోపడం చరిత్ర అని అన్నారు. 2021లో ఏపీ చీఫ్ మినిస్టర్ కు లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని, ఆనాడు సీఎం మీరు కారా, ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ ? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? అని ఎద్దేవా చేశారు. అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అని షర్మిల సవాల్ విసిరారు. మరి, షర్మిల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

This post was last modified on November 29, 2024 2:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బెయిల్ ర‌ద్దు చేయ‌మంటారా? : ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రికి సుప్రీంకోర్టు నోటీసులు

క‌డ‌ప ఎంపీ, వైసీపీ నాయ‌కుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి, వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప ణ‌లు ఎదుర్కొంటున్న వైఎస్…

2 mins ago

వెంకట్రామిరెడ్డి…ఏమిటీ పాడు పని?

సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై వైఎస్ జగన్ హయాంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు…

8 mins ago

పవన్ నేషనల్ ఇంటర్వ్యూ సూపర్ హిట్!

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలి ఢిల్లీ పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే.…

27 mins ago

మీ ఇద్దరికీ ఈ కాళ్ళ ఫాంటసీ ఏంటయ్యా …

ఇది పురుషాధిక్య సమాజం. నిజ జీవితంలోనే కాదు సినిమాల్లోనూ అదే కనిపిస్తుంది. అందుకే మార్కెట్, బిజినెస్ లెక్కలు హీరో మీద…

50 mins ago

వచ్చే నెలలోనే నా పెళ్లి, ఎక్కడంటే… : కీర్తీ!

కీర్తి సురేష్ పెళ్లి గురించి గతంలోనూ వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆమె ఖండించింది. కొన్ని రోజుల కిందట మరోసారి…

1 hour ago

వెంకట్రామిరెడ్డి…ఏమిటీ పాడు పని?

సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై వైఎస్ జగన్ హయాంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు…

1 hour ago