వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందని చెప్పుకొచ్చారు. తమ హయాంలో పోర్టులు నిర్మించేందుకు ప్రయత్నించామని, కార్యక్రమాలు కూడా చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఇవి అందుబాటులోకి వస్తున్నాయని, దీనివల్ల సంపద సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చారు. వీటివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతోపాటు ఉద్యోగాలు కూడా లభిస్తాయన్నారు.
సంపద సృష్టి అంటే ఇదీ.. అని వ్యాఖ్యానించిన జగన్ ప్రస్తుతం కూడా సంపద సృష్టి జరుగుతోందని, అయితే అది కూటమి నాయకులకు మాత్రమేనని విమర్శించారు. ఏ జిల్లాలో చూసినా పేకాట క్లబ్బులు పెరిగిపోయాయని, తద్వారా కూటమి పార్టీల నాయకులకు సంపద సృష్టి జరుగుతోందన్నారు. అలానే ఇసుకపై ఆధిపత్యం చేస్తున్నారని, ప్రజలకు అందకుండా చేస్తూ.. దానిలోనూ దోచుకుంటున్నారని, ఇది కూడా కూటమి నాయకులకు సంపద సృష్టిగా మారిందని ఎద్దేవా చేశారు.
మద్యం మాఫియా గడప గడపకు చేరిపోయిందని జగన్ విమర్శించారు. ఫలితంగా మద్యం విచ్చలవిడిగా మారిందని తెలిపారు. బెల్టు షాపులు లేని వీధి.. లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఎటు కొట్టుకుపోయాయని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యంగం నడుస్తోందని.. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకువెళ్తోందని వ్యాఖ్యానించారు. తమ హయాంలో వినిమయం పెరిగి మార్కెట్లు కళకళలాడాయని చెప్పుకొచ్చారు.
టీడీపీ కౌంటర్
జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని ఎవరు అప్పుల పాలు చేశారో.. కాగ్ నివేది కలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. తమ హయాంలో ఎవరూ ఎవరినీ చంపి.. డోర్ డెలివరీ చేయడం లేదని, వైద్యులు, ఇతర ఉన్నతస్థాయిలో ఉన్న ఉద్యోగులకు భద్రత ఉందని ఎక్కడా నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి కట్టి అరెస్టు చేయడం లేదని, ఎంపీలను చితకబాదడం లేదని, ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం లేదని తమ్ముళ్లు ఘాటుగా స్పందించారు.
This post was last modified on November 28, 2024 8:38 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…