జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిం దే. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించారు. నిధులు, నీళ్లు సహా అనేక విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని సాధించేందుకు ప్రయత్నించారు. బుధవారం పార్లమెంటు భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీతోనూ పవన్ భేటీ అయ్యారు. అనంతరం.. మరికొందరు కేంద్ర మంత్రలతోనూ భేటీ అయ్యారు.
అయితే.. బుధవారం రాత్రి పవన్ కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల కూటమి ఎంపీలు, కేంద్ర మంత్రుల కు ఢిల్లీలోని ప్రఖ్యాత తాజ్ హోట్‌లో భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు బీజేపీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు.. పురందేశ్వరి, సీఎం రమేష్, టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, కేశినేని చిన్ని సహా.. కేంద్ర మంత్రులు పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరు లు పాల్గొన్నారు.
అదేవిధంగా ఉత్తరాదికి చెందిన పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ విందుకు హాజరయ్యారు. 108 రకాల పదార్థాలతో పూర్తి శాకాహారంతో కూడిన విందు ఇవ్వడం గమనార్హం. ఈ విందులో ఉత్తరాది, దక్షిణాది స్వీట్లు, ఇతర పదార్థాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో అంతా శాకాహార పదార్థాలనే వడ్డించడం విశేషం. అయితే.. 108 సంఖ్యను ఎంచుకోవడం వెనుక కూడా ఆధ్యాత్మిక రీజన్ ఉందన్నది జాతీయ మీడియా మాట.
ఇటీవల కాలంలో పవన్ సనాతనం గురించి ఎక్కువగా చెబుతున్న నేపథ్యంలో దానిలో భాగంగానే 108 రకాలకు ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. ఇదిలావుంటే.. మోడీకి దన్నుగా పవన్ కల్యాణ్ రెండు కీలక విషయాలను ప్రస్తావించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో చర్చకు వచ్చారు. 1 బంగ్లాదేశ్, 2. పాలస్తీనా అంశాలను ప్రస్తావిస్తూ.. మోడీకి మద్దతుగా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో రాత్రికిరాత్రి జాతీయ మీడియా పవన్ ను హైలెట్ చేయడం గమనార్హం.
This post was last modified on November 28, 2024 11:00 am
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…