చిక్కడు దొరకడు టైపులో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై ఏడాది కిందట చేసిన వ్యాఖ్యలు, పెట్టిన సోషల్ మీడియా పోస్టులపై వర్మపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాకు చెందిన రామలింగం అనే టీడీపీ స్థానిక నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఈ కేసు ఎదుర్కొంటున్నది బలమైన వర్మ.. పైగా ఆయన లాజిక్కులు కూడా భిన్నంగా ఉంటున్నాయి!
ఎందుకంటే.. ఇలాంటి కేసులు, ఘటనలు, హత్యలపై వర్మకు ఉన్న పరిజ్ఞానం అంతా ఇంతా కాదు. చదువు రూపంలో ఆయనకు నాలెడ్జ్‌లేకపోవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఆయనకు నిబంధనలు తెలియక పోవచ్చు. కానీ, తాను సంపాయించుకున్న అపారమైన అనుభవం.. అనేక సినిమాల అనుభవంవంటివి వర్మకు కలిసి వస్తున్నాయి. అందుకే వర్మ.. చిక్కడు, దొరకడు టైపులో పోలీసులతో ఆడుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
తాజాగా సోసల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య ఆసక్తిగా మారింది. “ఎవరు పిల్లి.. ఎవరు ఎలుక?” అని ఏపీ పోలీసులు- వర్మ వ్యవహరిస్తున్న తీరుపై కామెంట్ చేశారు. సహజంగానే పోలీసులు నోటీసులు ఇచ్చాక హాజరు కావాలి. కానీ, వర్మ ఇప్పటికి రెండు సార్లు టైం తీసుకున్నారు. అయినా హాజరు కావడం లేదు. దీంతో ఆయనను అరెస్టు చేయాలన్నది ఏపీ పోలీసుల ఉద్దేశం. కానీ, ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే లాజిక్కులతో వర్మ కొట్టేస్తున్నారు.
“ఏడాది కిందటి కేసు. విచారణకు సహకరిస్తానన్నా.. నా కోసం వెతుకున్నారు. ఇదేం పద్ధతి” అని ఆయన ప్రశ్నించిన తీరు.. నిజంగానే పోలీసులను పక్కకు తప్పుకొనేలా ఉంది. ఇక, “అసలు నేను చేసిన కామెంట్లు ఒకరి గురించి. కానీ, మనో భావాలు ఎవరికో గాయపడ్డాయి. ఇదేం చిత్రం” అని కూడా వర్మ వ్యాఖ్యానించారు. ఇది రేపు కోర్టులో బలమైన వాదనగా మారనుంది.
ఎందుకంటే.. బాధితులుగా ఉన్న వారు పిర్యాదు చేస్తే.. ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. కానీ, ఇక్కడ బాధితుల కంటే మనో భావాలు దెబ్బతిన్నవారు వేరేగా ఉన్నారు. వారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో.. అప్పుడు కేసుకు పెద్దగా బలం ఉండదనేది వర్మ వాదన. దీంతో వర్మ.. ఇప్పట్లో అయితే చిక్కడు – దొరకడు టైపేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 27, 2024 11:18 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…