Political News

అదానీ సంకలో కేటీఆర్ దూరాడు: రేవంత్

సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో అదానీ గ్రూప్ పై లంచం ఇచ్చారన్న ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’కి అదానీ ఇస్తానన్న 100 కోట్లు వద్దని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ పై రేవంత్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ బుద్ధిమంతుడు అదానీ సంకలో దూరాడని కేటీఆర్ పై రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. కేటీఆర్ కాదు సైకో రాం అంటూ కేటీఆర్ కు రేవంత్ కొత్త బిరుదునిచ్చారు.

తమ ప్రభుత్వంపై కేటీఆర్ తలాతోకా లేని ఆరోపణలు చేస్తున్నారని, ఏం మాట్లాడుతున్నారో కేటీఆర్ కే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పక్కన ఉండేవారికే ఆయన చేష్టలు అర్థం కావటం లేదని, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబటట్టారు. కొన్ని మీడియా ఛానెల్స్ ను గత ప్రభుత్వం నిషేధించిన విషయం మర్చిపోయారా అని రేవంత్ నిలదీశారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే సైకోలా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, కేటీఆర్ కు.. సైకో రాం కరెక్ట్ పేరు అని చురకలంటించారు.

ఇక, కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నాడని, జైలుకు వెళ్తే సీఎం అవ్వొచ్చని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అలా అయితే, కేసీఆర్ కుటుంబం నుండి ఇప్పటికే జైలుకు వెళ్లిన కవితకు కేటీఆర్ కన్నా ముందే సీఎం అయ్యే చాన్స్ ఉందని సెటైర్లు వేశారు. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందని రేవంత్ చమత్కరించారు. కవితకు బెయిల్ కోసం పైరవీలు చేసేందుకు ఢిల్లీ వెళ్లలేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళతానని రేవంత్ అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఈ రోజు ఢిల్లీ వెళుతున్నానని, ఇది రాజకీయ పర్యటన కాదని స్పష్టం చేశారు.

ఈ ఫొటోలో ఉన్న కేసీఆర్ ను గుర్తు పడతరా..అంటూ అదానీతో కేసీఆర్ ఉన్న ఫొటోను మీడియాకు చూపించి సెటైర్లు వేశారు రేవంత్. అదానీకి గతంలో కేసీఆర్, కేటీఆర్ వంగి వంగి సలాం కొట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ బుద్ధిమంతుడు, ప్రబుద్ధుడు కేటీఆర్ అదానీ సంకలో దూరిండు అంటూ సెటైర్లు వేశారు. తాను ఎప్పుడూ అలా వంగి దండాలు పెట్టలేదని, నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడతారని.. అన్నారు. అదానీ సంస్థకు భారీ సంఖ్యలో ప్రాజెక్టులిచ్చిన గత ప్రభుత్వం కోట్ల రూపాయల కమీషన్లు కొట్టేసిందని సంచలన ఆరోపణలు చేశారు.

అదానీకి ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చారు, ఎన్ని రోడ్డు కాంట్రాక్టులు ఇచ్చారో విచారణ చేసేందుకు కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ ఎస్ కు అధికారంతో పాటు మెదడు కూడా పోయిందని రేవంత్ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో విచారణ చేయడం దమ్ముంటే అని సవాల్ విసిరింది బీఆర్ఎస్ నేతలేనని, అందుకే సాగునీటి పారుదల, విద్యుత్ వంటి విషయాలపై విచారణ మొదలుబెట్టామని గుర్తు చేశారు. ఇక, తమను పోలీస్ స్టేషన్లో పెట్టమని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నాని, ప్రతిపక్షాన్ని గౌరవించి వాళ్లు అడిగింది చేయాలి కదా అని చమత్కరించారు.

This post was last modified on November 26, 2024 9:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జ‌గ‌న్‌.. మ‌ధ్య‌లో చంద్ర‌బాబుకు చిక్కులు!

ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌, ప్ర‌పంచ కుబేరుడు గౌతం అదానీ.. ఏపీలో సౌర విద్యుత్‌కు సంబంధించి చేసుకున్న ఒప్పందాల వ్య‌వ‌హారంలో అప్ప‌టి…

6 mins ago

ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల కుర్రాడి సంచలనం

ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…

12 hours ago

ఏపీకి చెందిన ఏకైక ఎంపీ క‌లిశెట్టి మాత్ర‌మే ఇలా సాధ్య‌మైంది!!

టీడీపీ నాయ‌కుడు, విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు తీరు మార‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో చాలా మంది ఫొటోల‌కు ఫోజులు…

12 hours ago

సినిమాల వల్లే టూరిజం ప్రమోషన్ వేగవంతం: పవన్

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…

13 hours ago

నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు: బాలినేని

జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…

14 hours ago

చీరలో వయ్యారాలు వలకబోస్తున్న కొత్త పెళ్లి కూతురు..

తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…

14 hours ago