Political News

అదానీ-జ‌గ‌న్‌.. మ‌ధ్య‌లో చంద్ర‌బాబుకు చిక్కులు!

ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌, ప్ర‌పంచ కుబేరుడు గౌతం అదానీ.. ఏపీలో సౌర విద్యుత్‌కు సంబంధించి చేసుకున్న ఒప్పందాల వ్య‌వ‌హారంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు రూ.1750 కోట్ల మేర‌కు లంచాలు ఇచ్చార‌న్న అమెరికా ద‌ర్యాప్తు సంస్థ‌(ఎఫ్ బీఐ) అక్క‌డి కోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ ఏపీలో రాజ‌కీయ మంట‌లు రేపుతోంది. అదానీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. జ‌గ‌న్ విష‌యంలో సీఎం చంద్ర‌బాబుకు చిక్కులు పెరుగుతున్నాయి. జ‌గ‌న్‌పై చ‌ర్య‌ల‌కు ప‌ట్టుబ‌డుతూ.. క‌మ్యూనిస్టులు ఒక‌వైపు, కాంగ్రెస్ పీసీసీచీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోవైపు.. చంద్ర‌బాబుకు సెగ‌లు పెంచుతున్నారు.

సౌర విద్యుత్‌కు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రం కూడా చేసుకోని విధంగా భారీ ఎత్తున 7 వేల మెగా వాట్ల విద్యుత్‌ను 25 సంవ‌త్స‌రాలు పాటు కొనుగోలు చేసేలా జ‌గ‌న్ అదానీతో ఒప్పందం చేసుకున్నార‌న్న విష‌యం తెలిసిందే. అయితే.. వైసీపీ వాద‌న వేరేగా ఉంది. తాము ఒప్పందం చేసుకున్న‌ది సోలార్ ఎన‌ర్జీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(సెకీ)తో అయితే.. మ‌ధ్య అదానీ ఎవ‌రంటూ.. వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇది ఎవ‌రికీ అంతు చిక్క‌ని, కొరుకుడు ప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారిపోయింది.

పోనీ.. అదానీని కార్న‌ర్ చేయాలంటే.. బీజేపీకి ఆగ్ర‌హం వ‌స్తుంది. ఆయ‌న‌ను వ‌దిలేసి జ‌గ‌న్‌ను ఒక్క‌డిని విచారించాలంటే.. అస‌లు ఒప్పందం చేసుకున్న‌దే అదానీ! ఇది కూట‌మి స‌ర్కారుకు త‌ల‌నొప్పిగా మారింది.

దీంతో కూట‌మి పార్టీల‌ను చంద్ర‌బాబు దాదాపు సైలెంట్ చేసేశారు. ఈ విష‌యంపై తానే తేల్చుకుంటాన‌ని ఎవ‌రూ మాట్లాడ వ‌ద్ద‌ని ఆయ‌న చెప్ప‌డంతో కూట‌మిలోని కీల‌క‌మైన టీడీపీ, జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ఎవ‌రూ ఈ వివాదం జోలికి పోవ‌డం లేదు. కానీ, తురుపు ముక్క‌లుగా ఉన్న కాంగ్రెస్ , క‌మ్యూనిస్టులు మాత్రం చంద్ర‌బాబును కేంద్రంగా చేసుకుని నిప్పులు చెరుగుతున్నారు. జ‌గ‌న్ చేసుకున్న ఒప్పందాల‌ను అనుమ‌తుల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలంటూ ష‌ర్మిల డిమాండ్ చేస్తున్నారు. జ‌గ‌న్ హ‌యాంలో అర్ధ‌రాత్రి చేసుకున్న ఒప్పందాల నిగ్గు తేల్చాల‌ని కూడా ఆమె కోరుతున్నారు.

ఇక‌, క‌మ్యూనిస్టుల విష‌యానికి వ‌స్తే.. సీపీఎం నాయ‌కుడు బీవీ రాఘ‌వులు కూడా ఇదే స్వ‌రం వినిపిస్తున్నారు. ఒప్పందాలు ర‌ద్దు చేసి.. ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గించాల‌ని కోరుతున్నారు. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ హ‌యాంలో అదానీ కంపెనీతో కుదుర్చుకున్న స్మార్ట్ మీట‌ర్ల ఒప్పందాన్నికూడా స‌మీక్షించి ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ, ఈ రెండు ఒప్పందాలు ర‌ద్దు చేసుకునే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే నిబంధ‌న‌ల్లో పేర్కొన్న‌ట్టుగా.. ఈ ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకుంటే సుమారు రెండు ఒప్పందాల‌కు క‌లిపి 5 వేల కోట్ల‌ను అదానీ కంపెనీకి ఏపీ ప్ర‌భుత్వం చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఇది కేంద్రంలోని పెద్ద‌ల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారం కావ‌డంతో చంద్ర‌బాబుకు ఇప్పుడు చిక్కులు ఎద‌రవుతున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 26, 2024 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తండేల్ రేట్ల పెంపుపై హాట్ డిస్కషన్లు

ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…

42 minutes ago

చంద్రబాబు మార్క్… తెలుగులో తొలి జీవో విడుదల

దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…

58 minutes ago

జపాన్ దేశానికి ‘శనివారం’ – సరిపోతుందా?

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…

2 hours ago

గేమ్ ఛేంజర్ పైరసీ… బన్నీ వాస్ కామెంట్స్

గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…

2 hours ago

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

7 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

8 hours ago