ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన వైసీపీ నేతలు ఇప్పటికీ వాస్తవంలోకి రాలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉండగా జగన్ అండ్ కో ఎన్నెన్ని తప్పులు చేశారో.. పాలన ఎంత ఘోరంగా సాగిందో తెలిసిందే. కానీ ఆ విషయాలను ఇప్పటికీ ఆ పార్టీ నేతలు అంగీకరించలేకపోతున్నారు.
తమ పాలన అద్భుతంగా సాగిందని.. ఎన్నికల్లో అక్రమాలు చేసి కూటమి గెలిచేసిందని ఇప్పటికీ చెప్పుకుంటూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలను చూస్తే వైసీపీ నేతలు ఎప్పటికీ రియాలిటీలోకి రాలేరేమో అనిపిస్తుంది. చాలామంది వైసీపీ నేతల్లాగే ఈవీఎంలతో మాయ చేసి కూటమి గెలిచేసిందనే వాదననే రోజా కూడా వినిపించింది.
ఎన్నికల ఫలితాల రోజు రోజా రెండు రౌండ్ల ఫలితాలు వచ్చేసరికే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అందుకు కారణాన్ని ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించింది. తొలి రౌండ్లో తనకు బాగా కలిసొచ్చే వడమాల పేట ప్రాంతం ఓట్లు లెక్కిస్తారని.. అది వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతం అని.. అక్కడ ప్రత్యర్థికి 3 వేల మెజారిటీ రావడం చూసి ఈ ఎన్నికలు సక్రమంగా జరగలేదని.. ఈవీఎంల్లో ఏదో చేశారని అర్థమై తాను కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు రోజా తెలిపారు.
నియోజకవర్గంలో తాను ఎంతో చేశానని.. సంక్షేమ పథకాలను గొప్పగా అమలు చేశానని.. అలాంటిది దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా రెండు మూడు వేల ఓట్లతో గెలిచిన నియోజకవర్గంలో ఆయన కొడుకు గాలి భాను ప్రకాష్ ఎలా 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని రోజా ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చిత్తూరు జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులందరినీ మార్చేశారని.. ప్రభుత్వ వ్యవస్థే కూటమి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపించిందని రోజా వివరించింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికీ ఎంతో మంచి చేశారని.. అలాంటి వ్యక్తిని కాదని వేరే వాళ్లకు జనం ఓటేసే పరిస్థితే లేదని.. అందుకే ఈ ఎన్నికలను తాము నమ్మడం లేదని ఆమె స్పష్టం చేశారు.
This post was last modified on November 25, 2024 10:45 am
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…