భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా.. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కూడా కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. అదేవిధంగా జీఎస్టీలో చట్టంలో మార్పులు(రాష్ట్రాలు కోరినప్పుడల్లా ఈ చట్టంలో సవరణలు చేసుకునే అవకాశం. తద్వారా మరింత పన్నులు విధించే అవకాశం ఏర్పడుతుంది) చేపట్టే సవరణ బిల్లును కూడా ఈ సభల్లోనే ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అలానే ముస్లింలకు సంబంధించి వక్ఫ్ ఆస్తుల విషయంలో వారికి ఇచ్చిన ప్రత్యేక అధికారాలను కట్ చేసేలా సవరణ బిల్లును రూపొందించారు.
ఇలా పలు బిల్లులతో కేంద్రం రెడీ అయింది. దీనికి సంబంధించి అన్ని పక్షాలను అలెర్ట్ చేసింది. సభలను ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఎప్పుడూ పాడే పాటనే మరోసారి పాడారు. అయితే.. తొలిరోజే ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసన, ఆందోళన రెండూ వ్యక్తమయ్యాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీపై అమెరికాలో కేసులు నమోదు కావడం, భారత దేశంలోని పలు రాష్ట్రాలకు ఆయన లంచాలు ఇవ్వడం వంటి కీలక అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ఈ క్రమంలోనే పార్లమెంటరీ సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేయాలని, ఈ లంచాల వ్యవహారంపై నిగ్గు తేల్చాలని కూడా పట్టుబట్టాయి.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో అదానీ వ్యవహారం, ఆయనపై అమెరికాలో నమోదైన కేసులు, ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ఆయన ఇచ్చిన లంచాలు వంటివి ప్రధానంగా ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయన్నది సుస్పష్టంగా తెలుస్తోంది. ఇటు లోక్‌సభలోను, అటు రాజ్యసభలోనూ అదానీ వ్యవహారమే ప్రతిపక్షాలకు ఇప్పుడు అందివచ్చిన అస్త్రంగా మారనుంది. మరీ ముఖ్యంగా టీడీపీ ఇప్పటికే రెడీ అయింది. అదానీ-జగన్ లంచాల విషయాన్ని లోక్‌సభలో ప్రస్తావించాలని సీఎం చంద్రబాబు తన పార్టీ ఎంపీలకు తేల్చి చెప్పారు. దీంతో లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించనున్నారు.
ఇక, కాంగ్రెస్ సహా.. ఇండియా కూటమి పార్టీల సభ్యులు ఉభయ సభల్లోనూ అదానీ విషయాన్నే ప్రస్తావించనున్నారు. అయితే.. మహారాష్ట్రలో దక్కించుకున్న భారీ విజయం సమా.. తమ ఓటు బ్యాంకు పెరగడంతో బీజేపీ సభ్యులు ఆ విషయాన్ని పార్లమెంటు వేదికగా.. ప్రస్తావించి కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టవచ్చు. ప్రజా మద్దతు కోల్పోతున్నారని, ఓటు బ్యాంకు హీనంగా మారిందని ఇప్పటికే ప్రధాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్ర సహా ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ప్రస్తావించి.. కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా.. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ‘అదానీ’ సమావేశాలుగా అయితే మారడం ఖాయం!!
This post was last modified on November 25, 2024 6:24 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…