ఒకవైపు దేశాన్ని మరోవైపు ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తున్న అంశం… ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ కుబేరుడు.. గౌతం అదానీ వర్సెస్ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ లంచాల వ్యవహారం. సుమారు 1750 కోట్ల వరకు జగన్‌కు లంచాలు ఇచ్చారనేది అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) పేర్కొంది. అమెరికాలోనూ అదానీ కొందరికి లంచాలు ఇచ్చారన్న అభియోగాలతో కొన్నాళ్ల కిందటే రంగంలోకి దిగిన ఎఫ్ బీఐ.. మొత్తంగా ఆయన వ్యవహారాలను కూపీ లాగింది. ఈ క్రమంలోనే ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన లంచాల వ్యవహారం వెలుగు చూసినట్టు తెలిపింది.
ఎందుకిచ్చారు?
గౌతం అదానీ వంటి ప్రముఖ పారిశ్రామిక వేత్త లంచాలు ఇవ్వడం ఆశ్చర్యం, విస్మయం కూడా కలిగించింది. అయితే.. ఆయన ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చారన్నది మరింత ఆసక్తికరంగా మారింది. సోలార ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) ఏపీలో సౌర విద్యుత్ కు సంబంధించి.. ఒప్పందాలు చేసుకుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. అయితే.. దీనికి అదానీ సంస్థల నుంచే విద్యుత్ వస్తుంది. సెకీతో ఒప్పందం చేసుకుంటే.. అది అదానీకి మేలు చేస్తుంది. దీంతో పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ సహా బీజేపీయేతర పార్టీలు పాలన సాగిస్తున్న రాష్ట్రాలు ఈ ఒప్పందానికి దూరంగా ఉన్నాయి.
కానీ, ఏపీ సహా బీజేపీని ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థించే రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. తద్వారా అదానీకి మేలు చేయాలన్నది ఈ ఒప్పందం సారాంశం. ఇలా తనకు మేలు చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకునేలా ప్రభుత్వాలను అదానీ ఒప్పంచారు. ఈ క్రమంలోనే ఏపీలో జగన్ ప్రభుత్వంతో ఆయన రాత్రికి రాత్రి ఒప్పందం చేసుకున్నారు. అంతేకాదు.. దీనికి పోటీ లేకుండా ఎలాంటి టెండర్లు కూడా పిలవకుండానే ఒప్పందం చేసుకోవడం గమనార్హం. సో.. దీనివెనుక ధనం చేతులు మారిందనడానికి బలం చేకూరింది.
కూటమిలో తలోరకం!
అదానీ నుంచి జగన్.. లంచాలు తీసుకున్నారన్న వార్తలు వచ్చిన దరిమిలా.. టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి, అక్రమాలు రాష్ట్రాలు దాటి ప్రపంచ స్థాయికి చేరిందని కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు అసెంబ్లీలోనే ఎండగట్టారు. అయితే.. కూటమిలో మిగిలిన పార్టీలైన బీజేపీ, జనసేనలు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోనట్టే వ్యవహరించాయి. జగన్‌పై నా.. అదానీపైనా పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు. దీనికి కారణం .. కేంద్రంలోనిపెద్దలకు, అదానీకి మధ్య సత్సంబంధాలు కొనసాగుతుండడమే. దీంతో వారు నోరు విప్పేందుకు కూడా ముందుకు రాలేదు.
జగన్ ధైర్యం అదే!
ఇంత జరుగుతున్నా.. అదానీ నుంచి 1750 కోట్లు అప్పనంగా పుచ్చుకున్నారని విమర్శలు, వార్తలు వచ్చినా.. జగన్ బ్యాచ్ ఎక్కడా తల్లడిల్లలేదు. ఎక్కడా ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేయలేదు. దీనికి కారణం.. అంతా ‘పైవారు’ చూసుకుంటారన్న భరోసానే కారణమని అంటున్నారు పరిశీలకులు. పైవారు చెబితేనే ఏపీలోకి అదానీని రానిచ్చారన్న వాదన కూడా గతంలో వినిపించింది. సో.. ఇప్పుడు కూడా అంతే! ఇక, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్‌ను ఈ కేసును అడ్డుపెట్టి ఏం చేయాలని అనుకున్నా.. సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఇది అంతర్జాతీయ కేసు కావడం.. అందునా లంచాలు ఇచ్చిన వ్యక్తి.. పెద్దలకు అత్యంత సన్నిహితుడు కావడంతో కూటమి పార్టీలో కీలకమైన టీడీపీ దీనిని రాజకీయంగా మాత్రమే వాడుకునేందుకు పరిమితం అయ్యే అవకాశం ఉంది.
This post was last modified on November 25, 2024 6:20 am
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…