మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేకే సర్వే అంచనాలకు దగ్గరగా ఉండడంతో హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీయే కూటమి 225 స్థానాల్లో విజయం సాధిస్తుందని కేకే సర్వే స్పష్టంగా పేర్కొనగా, ఫలితాలు కూడా దాదాపు అదే విధంగా ఉండటం విశేషంగా మారింది.
తెలుగు వ్యక్తి కేకే, తన అంచనాలతో జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో తెలంగాణ ఎన్నికల్లో ఆయన ఇచ్చిన సర్వే అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన చేసిన సర్వే 100% సరిగా తేలడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మార్మోగింది. ముఖ్యంగా, టీడీపీ కూటమి విజయం, జనసేన 21 సీట్లు గెలుచుకుంటుందని చెప్పిన ఆ సర్వే అంచనాలు కూడా వాస్తవంగా మారాయి.
మహారాష్ట్ర ఎన్నికల సర్వే అంచనాలకు ముందు, హర్యానా అసెంబ్లీ ఫలితాలపై కేకే సర్వే కొద్దిగా తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రపై కేకే సర్వే పై కొన్ని అపనమ్మకాలు వ్యక్తమయ్యాయి. అయితే, కేకే తన అంచనాలపై ధీమా వ్యక్తం చేస్తూ, “మా సర్వే కచ్చితంగా ఫలితాలకు అనుగుణంగా ఉంటుంది, దీన్ని రాసిపెట్టుకోవచ్చు,” అని చెప్పారు.
ఇతర జాతీయ సర్వేలు మహారాష్ట్రలో ఎన్డీయే విజయాన్ని ఊహించాయి కానీ, 225 సీట్ల స్థాయి విజయాన్ని మాత్రం ఎవరూ అంచనా వేయలేదు. కేకే సర్వే మాత్రం ఈ గణాంకాలను ధైర్యంగా ప్రకటించడం, ఇప్పుడు అవి వాస్తవంగా మారడం విశేషం. ఇప్పటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ఫలితాలు మాత్రమే కాకుండా, రాబోయే 2024 ఎన్నికలపై కేకే అంచనాలకు రాజకీయ వర్గాల్లో మరింత విశ్వాసం పెరుగుతుందనడంలో సందేహం లేదు. కేకే వంటి సర్వేలు ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయని, సమకాలీన రాజకీయాలు అర్థం చేసుకోవడంలో కీలకంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
This post was last modified on November 23, 2024 11:43 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…