మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్న బీజేపీ కూటమి మహాయుతి సంబరాల్లో మునిగిపోయింది. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు. 288 స్థానాలకు గాను ఏకపక్షంగా ఈ కూటమి 210 స్థానాల్లో విజయం దక్కించుకుంది. మరోవైపు ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. దీంతో అధికారం ఎవరిదనేది స్పష్టమైంది. అయితే.. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు సంబరాల్లో మునిగిపోతే.. కీలక నాయకులు మాత్రం కుస్తీలు పడుతున్నారు.
ముఖ్యమంత్రి పీఠంపై కూటమి నేతల మధ్య పట్టు బెట్టు సాగుతోంది. బీజేపీ+శివసేన+ ఎన్సీపీలు కూట మిగా ఏర్పడి.. ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్నికల్లో గెలిస్తే.. సీఎం సీటు ఎవరు తీసుకోవాలన్న వ్యవహా రం ఎన్నికలకు ముందే చర్చకు వచ్చింది. అయితే ముందు గెలవండి తర్వాత చూద్దాం.. అంటూ బీజేపీ అధిష్టానం మెలిక పెట్టింది. దీంతో ఎవరికి వారు కృషి చేశారు. చివరకు భారీ విజయం నమోదు చేసుకు న్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం సీటు కోసం ఎవరికి వారే పట్టుబడుతున్నారు.
బీజేపీకి ఏకపక్షంగా 122 స్థానాల్లో విజయం దక్కనుండగా.. ఈ పార్టీ మిత్రపక్షం, ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే పార్టీ శివసేన 55 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమైంది. మరోవైపు ఈ కూటమిలోని మరో పార్టీ ఎన్సీపీ 38 స్థానాల్లో గెలవనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీటు కీలకంగా మారింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. బీజేపీకి కనుక 145 సీట్లు వస్తే.. కూటమిని కూడా కాదని.. తానే పూర్తిస్థాయిలో అధికారంలోకి వచ్చేది. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో 30 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది.
సో.. దీంతో మహాయుతి కూటమి కొనసాగనుంది. అయితే.. మెజారిటీ స్థానాలు బీజేపీకే దక్కిన నేపథ్యంలో సీఎం సీటును కమల నాథులే తీసుకునే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పదవిని ప్రస్తుత సీఎం, శివసేన నేత ఏక్‌నాథ్ షిండేకు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. అంటే.. ప్రస్తుత సీఎం షిండే.. డిప్యూటీ సీఎం అవుతారు. ప్రస్తుతం డిప్యూటీగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్.. సీఎం అయ్యేందుకు చాలా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అయితే.. దీనికి షిండే ఒప్పుకోవడం లేదు. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని ఏం లేదు అని షిండే వ్యాఖ్యానించారు. కూటమి మీటింగ్ పెట్టుకున్నతరువాత సీఎం ఎవరో నిర్ణయిస్తామన్నారు. దీంతో సీఎం సీటు వ్యవహారం చిక్కులు తెస్తుందనేది తెలుస్తోంది. అయినప్పటికీ కాంగ్రెస్‌కు ఛాన్స్ లేదు.
This post was last modified on November 23, 2024 6:00 pm
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…