మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహా విజయం దక్కించుకుంది. ఊహలకు సైతం అందని విధంగా దూకుడుగా ముందుకు సాగింది. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి కనీవినీ ఎరుగని విధంగా.. దూసుకుపోయింది. 210 స్థానాల వద్ద విజయతీరానికి సగర్వంగా చేరుకుంది. ఇదేమీ మామూలు విషయం కాదు. 1990 తర్వాత.. ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమిని ప్రజలు గెలిపించారు.
ముఖ్యంగా బీజేపీకే ఈ క్రెడిట్ దక్కనుంది. 2019లో ఏర్పడిన శివసేన-బీజేపీ కూటమి మధ్యలోనే ముక్కలైంది. సీఎం సీటు విషయంలో ఏర్పడిన వివాదంతో శివసేన పోయి పోయి కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. అనంతర కాలంలో బీజేపీ వేసిన ఎత్తుగడ, రాజకీయ వ్యూహాలతో శివసేన నిలువునా చీలిపోయి.. బీజేపీతో చేతులు కలిపింది. దీనిపై అనేక విమర్శలు వచ్చినా.. తాజా ఎన్నికల్లో ప్రజలు అసలైన శివసేనగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీకే పట్టం కట్టారు.
ఇక, మహాయుతిగా ఏర్పడిన బీజేపీ-శివసేన-ఎన్సీపీలకు ప్రజలు పట్టంకడతారా? అన్నది పెద్ద చిక్కు ప్రశ్నగానే మారింది. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కుప్పకూల్చి.. బీజేపీ ఇక్కడ పగ్గాలు చేపట్టిందన్న విమర్శలు.. వాదనలు, విశ్లేషణలు.. ఉన్నా.. ప్రజలపై ఆ ప్రభావం చూపించలేదు. బీజేపీ పేర్కొన్న అభివృద్ధితో కూడిన సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారనే అనుకోవాలి. ముఖ్యంగా సీఎం ఏక్‌నాథ్ షిండే చివరి దశలో అనుసరించిన వ్యూహానికి ప్రజలు మద్దతుగా నిలిచారు.
ఫలితంగా 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే కూటమికి 210 స్థానాలకు పైగా ప్రజలు పట్టం కట్ట డం గమనార్హం. నిజానికి ఇంత మెజారిటీ దక్కుతుందని ఏ పార్టీ కూడా ఊహించలేదు. చివరకు సర్వేలు కూడా మహాయుతి కూటమి సర్కారుఏర్పాటు చేస్తుందని చెప్పినా.. ఇంత మెజారిటీ సంఖ్యలో సీట్లు దక్కించుకుంటుందని ఎవరూ అంచనా వేయలేక పోయారు. ఈ పరిణామాలతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న చర్చలకు ఫుల్ స్టాప్ పడినట్టయింది.
This post was last modified on November 23, 2024 1:06 pm
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…