అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ లంచం ఇచ్చారని, సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అదానీతో జగన్ కు లింకులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదానీ- జగన్ ఇష్యూపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అదానీ ముడుపులిచ్చారని కోర్టు చెప్పిందని, అయితే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమనండి అని కేటీఆర్ అన్నారు. కోర్టు చెప్పిన తర్వాత చట్టం, ధర్మం, న్యాయం ప్రకారం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, అందులో తప్పు లేదని అన్నారు. లంచం ఎవరికిచ్చినా సరే…అది ఎవరైనా సరే..మీడియా ప్రతినిధులు అంటున్నట్లు జగన్ అయినా సరే చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే, ముడుపులు ఎవరికిచ్చారో తనకు తెలియదని…ఇచ్చిన మాట నిజమే అయితే తప్పకుండా చర్యలు.తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అదానీ తెలంగాణకు రాలేదని, కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండానే అదానీకి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరిచారా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ కంపెనీలతో 12,400 కోట్ల రూపాయల విలువైన ఎంవోయూలు రేవంత్ రెడ్డి కుదుర్చుకున్నారని ఆరోపించారు.
విద్యుత్ ప్రాజెక్టులను అదానీకి అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారని సంచలన ఆరోపణ చేశారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో అదాని కంపెనీలు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
This post was last modified on November 23, 2024 10:00 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…