కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల సెటైర్లు పేల్చారు. కడప ఉక్కు.. చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీలా మారిందని ఎద్దేవా చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని విభజన చట్టంలోనే పేర్కొన్నారని.. అయితే, దీనిని నిర్మించే విషయంలో గత వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయయని ఆమె విమర్శించారు. కేవలం శంకు స్థాపనలకే గత రెండు ప్రభుత్వాలు పరిమితం అయ్యాయయని ఆమె వ్యాఖ్యానించారు.
చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ.. అన్నట్లుగా తయారైంది కడస స్టీల్ ఫ్యాక్టరీ పరిస్థితి.. కేవలం టెంకాయలు కొట్టే ఫ్యాక్టరీగానే స్టీల్ ఫ్యాక్టరీని గత పాలకులు తయారు చేశారు. పేద ప్రజల కోసం, కడప ప్రాంత అభివృద్ధి కోసం వైయస్సార్ చిత్తశుద్దితో తీసుకొచ్చిందే కడప స్టీల్ ఫ్యాక్టరీ. 10వేల ఎకరాల్లో 20వేల కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నుల కెపాసిటీతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలన్నది వైయస్సార్ ఆశయం. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం ద్వారా 25వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంది అని షర్మిల వివరించారు.
2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉండేదని తెలిపారు. అయితే.. అధికారంలోకి వచ్చిన పార్టీలు(ఏపార్టీ అనేది చెప్పలేదు) ఈ విషయాన్ని తెరమరుగు చేశాయని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు 2014కు ముందు అనేక హామీలు ఇచ్చారని.. కానీ, ఒక్క హామీ కూడా నెరవేర్చలేక పోయారని విమర్శించారు. ఏపీ పట్ల బీజేపీ చిన్నచూపు చూస్తోందని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని విస్మరించారని నిప్పులు చెరిగారు.
జగన్ ఆస్కార్ డైలాగులు
కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో జగన్ ఆస్కార్ సినిమాల తరహా డైలాగులు పేల్చారని షర్మిల దుయ్యబట్టారు. మూడేళ్లలో స్టీల్ ఫ్లాంట్ కట్టి తన చిత్తశుద్దిని నిరూపించుకుంటానని చెప్పారని గుర్తు చేశారు. అయితే, స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఐదేళ్లలో జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. పదేళ్లుగా కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏం చేశారో చెప్పాలని షర్మిల నిలదీశారు. ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 20, 2024 7:27 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…