ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదే ళ్లు కాదు.. మరో పదేళ్ల వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పారు. “నేను మా సభ్యలు పక్షాన చెబుతున్నా.. ఐదేళ్లు కాదు.. వచ్చే పదేళ్లు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన మమ్మల్ని కోరడం కాదు.. ఆదేశించాలి. ఆయన విజన్ మేరకు మేం పనిచేస్తాం. ఈ విషయంలో నేను స్వయంగా మాటిస్తున్నా” అని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు విజన్‌ను ప్రశంసించిన పవన్ కల్యాణ్ .. దేశం మొత్తం చంద్రబాబువైపు చూస్తోందన్నారు. ఆయన అడుగు జాడల్లో నడిచే అవకాశం లభించడం.. అంత చిన్న విషయం కాదన్నారు. చంద్రబాబు విజన్ 2047ని నెరవేర్చేందుకు తమ వంతుకృషి చేస్తామనిచెప్పారు. వచ్చే ఐదేళ్లే కాదు.. మరో పదేళ్ల వరకు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును మించిన సమర్ధుడైన నాయకుడు లేరన్నారు.
సముర్ఢుడైన నాయకులు ఎలా ఉండాలో చంద్రబాబును చూస్తే అర్ధమవుతుందన్నారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్నని దగ్గర ఉండి నడిపిన తీరు అభినందనీయం. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమం. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలు వచ్చాయి అని పవన్ వ్యాఖ్యానించారు. అలాంటి వరదల్లోనూ వయసుతో సంబంధం లేకుండా రేయింబవళ్లు అక్కడే ఉండి.. ప్రజలకు సేవలందించారని ఇది చాలదా.. చంద్రబాబు సమర్థతను చెప్పేందుకు అని పవన్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates