ఐదు నెలల్లోనే దూకుడు.. వ‌చ్చే నాలుగేళ్ల మాటేంటి ..!

టీడీపీ అధినేత‌.. సీఎం చంద్ర‌బాబు ఐదు నెల్ల‌లోనే దూకుడు పెంచారు. రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఐదు మాసాలే అయింది. ఇంత‌లోనే అనేక రూపాల్లో సీఎంచంద్ర‌బాబు త‌న స‌త్తా చాటుతున్నా రు. ఒక‌వైపు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేస్తూనే.. మ‌రోవైపు, పాల‌నా ప‌రంగా బ‌ల‌మైన సంకేతాలు ఇస్తున్నారు. అభివృద్ధి-సంక్షేమం పేరుతో వేస్తున్న అడుగులు సామాన్యుల‌ను మ‌రింత‌గా బాబువైపు మ‌ళ్లేలా చేస్తున్నాయి.

పింఛ‌న్ల పెంపుతో ప్రారంభ‌మైన చంద్ర‌బాబు పాల‌న‌.. ఇప్పుడు అమ‌రావ‌తి వైపు వ‌డివ‌డిగా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రో 20 రోజుల్లో ప్ర‌భుత్వం దృష్టి అంతా కూడా రాజ‌ధానిపైనే ఉండ‌నుంది. ఇప్ప‌టికే నిధులు తెచ్చుకునే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అయిన చంద్ర‌బాబు.. ఇప్పుడు ప‌నులు ప్రారంభిం చేందుకు ముహూర్తాలు రెడీ చేసుకుంటున్నారు. ఇది కూడా స‌క్సెస్ అయితే..వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రా ల పాటు రాజ‌ధానిపనులు ఊపందుకుంటాయి.

ఇక‌, సూప‌ర్ సిక్స్ హామీల్లో కీల‌క‌మైన ఉచిత సిలిండ‌ర్ల ప‌థ‌కానికి ఇప్ప‌టికే శ్రీకారం చుట్టారు. మ‌హిళ‌ల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు వేస్తున్నారు. ఇక‌, మ‌రో కీల‌క ప‌థ‌కం దిశ‌గా కూడా అడుగులు ప‌డుతున్నా యి. కుదిరితే డిసెంబ‌రు నుంచే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు. ఇది మ‌రింత‌గా చంద్ర‌బాబు పాల‌న‌కు మంచి మార్కులు వేసే అవ‌కాశం ఉంది. ఇక‌, ఇప్పుడు రేష‌న్ కార్డుల పంపిణీని కూడా చేప‌ట్ట‌నున్నారు.

ఇది పాల‌నా ప‌రంగా వేస్తున్న అడుగులు. ఇక‌, రాజకీయంగా చూసుకుంటే.. ప్ర‌తిప‌క్ష వైసీపీ అధికారంలో ఉండ‌గా చేసిన త‌ప్పుల‌ను ఏక‌రువు పెడుతున్నారు. గ‌ణాంకాల‌తో స‌హా స‌భ‌కు వెల్ల‌డిస్తున్నారు. ఇదేస‌మ యంలోసోష‌ల్ మీడియాను గాడిలో పెట్టే చ‌ర్య‌లు కూడా తీసుకుంటున్నారు. ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తూ.. సోష‌ల్ మీడియాను కంపు చేసిన వారిని అరెస్టు చేయించ‌డం.. కేసులు పెట్టించ‌డం ద్వారా.. సోషల్ మీడియాను సంస్క‌రిస్తున్నార‌నే చెప్పాలి. ఇలా.. ఐదు మాసాల్లోనే దూకుడుగా ఉన్న చంద్ర‌బాబు వ‌చ్చే నాలుగేళ్ల‌లో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.