వైసీపీ యువ నాయకుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 24న అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్ బాబాయి.. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రెండేళ్ల కిందట ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ఆ వెంటనే తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. అయితే.. ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. గత ఏడాది వివేకానందరెడ్డికుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
పలు దఫాలుగా ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా.. అవినాష్‌కు ఎలాంటి నోటీసులు రాలేదు. అయితే.. మంగళవారం జరిగిన విచారణలో సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో ఉన్న నిందితులను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని అవినాష్ అనుచరుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెదిరించారని సంబంధిత ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
అదే విధంగా శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య పదే పదే కడప జైలుకువెళ్లారని.. ఈయన జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు చేసే డాక్టర్ కాదని లూథ్రా తెలిపారు. కానీ, ఉద్దేశ పూర్వకంగా జైలుకు వెళ్లి నిందితులను , సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఇవన్నీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నవేనని వివరించారు. ఆయా వివరాలను నమోదు చేసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం అవినాష్‌రెడ్డినోటీసులు జారీ చేసింది. అదేవిధంగా శివశంకర్‌రెడ్డి కి కూడా నోటీసులు ఇచ్చింది. విచారణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీకి వాయిదా వేసింది.
This post was last modified on November 19, 2024 2:07 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…