వైసీపీ హయాంలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు వందలాది ఎకరాల భూములు కబ్జా చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీలో అసైన్డ్ భూముల వ్యవహారం చర్చకు వచ్చింది. అయితే, అంతకన్నా పెద్ద స్కామ్ మరోటి ఉందని ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఏపీలో 108 సేవ ముసుగులో అరబిందో సంస్థ భారీ దోపిడీకి పాల్పడిందని సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వందల కోట్లు దోచుకున్న ఆ సంస్థ సకాలంలో రోగులను ఆస్పత్రులకు చేర్చలేక పోయిందని విమర్శించారు. 2016లో ఒక్కో అంబులెన్స్‌కు లక్షా 30వేల రూపాయల చొప్పున 436 అంబులెన్స్‌ల కోసం ఒప్పందం కుదిరిందని సత్యకుమార్ వెల్లడించారు. 2020లో పాత అంబులెన్స్‌లకు రూ. 2,27,257, కొత్త అంబులెన్స్ లకు రూ.1,75,078లు చెల్లించేలా ఒప్పందం కుదిరిందన్నారు.
కానీ, సరైన సేవలు ఇవ్వకుండా కోట్లు దండుకుని 108 వ్యవస్ధను నిర్వీర్యం చేశారని, గోల్డెన్ అవర్‌లో వైద్య సర్వీసులు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. గోల్డెన్ అవర్‌లో 11 నుంచి 20 శాతం రోగులను మాత్రమే ఆస్పత్రులకు చేర్చగలిగారని సత్యకుమార్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాల నిర్వహణ బాధ్యతలను అరబిందో సంస్థ చూసిన నేపథ్యంలో సత్య కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరబిందో అక్రమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే కాంట్రాక్టు గడువు మిగిలి ఉండగానే నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంది. అరబిందో స్థానంలో నిర్వహణ బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
This post was last modified on November 19, 2024 9:52 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…