సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం సండే అయినా మండే అయినా తగ్గేదేలే అన్నట్లుగా తమ తమ రాజకీయ అజెండాతో ముందుకు సాగుతుంటారు.
అలా తాజాగా ఓ వైపు మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు తెలంగాణలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తన పాలనలో అనేక సవాళ్లు, విమర్శలు ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ వరప్రదాయినిగా కేసీఆర్ ఆండ్ కో ప్రొజెక్ట్ చేసింది. కేసీఆర్ బ్యాడ్ లక్ కావచ్చు లేదా మరేదైనా కారణం అయి ఉండవచ్చు కానీ .. సరిగ్గా గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరంలోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ ప్రాజెక్టు మూడు పిల్లర్లు కుంగడం తీవ్ర కలకలం రేపింది. అయితే, దీనిపై గతంలో ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. ఏకంగా విచారణకు కూడా ఆదేశించింది. నాణ్యత లోపంతోనే పిల్లర్లు కుంగినట్లు ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం కమిషన్ వేసి ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పేర్కొంటూ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.
ఇలా ఓ వైపు కాళేశ్వరంలో కథాకమామిషు తేల్చడమే కాకుండా మరోవైపు కాళేశ్వరం వల్ల వచ్చిన ఫలితాలు ఏం లేవంటూ కూడా కేసీఆర్ కలల ప్రాజెక్టుపై రేవంత్ విరుచుకుపడుతున్నారు. దీనికి నిదర్శనం తాజాగా రేవంత్ చేసిన ఓ ట్వీట్. రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా వరి పంట సాగు జరిగిందని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని జోడిస్తూ… ఈ సంవత్సరంలో 66.77లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైందని, 153 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందనే వార్తను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా రైతులు ఈ ఘనత సాధించారు. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో అసలు సంబంధం లేకుండానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం వెనుక అసలు లాజిక్… కేసీఆర్ కలల ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఏం లేదనేది తెలియజేయడమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆర్థికంగా పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆరోపణలు చేస్తూ…. అవినీతిపై దర్యాప్తు అంటూ గులాబీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్న రేవంత్ తాజాగా ఇప్పుడు ప్రాజెక్టు ప్రయోజనాలు ఏం లేవంటూ కామెంట్ చేయడం చూస్తుంటే…ఆదివారం కూడా విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ ను వదిలిపెట్టకుండా రేవంత్ టార్గెట్ చేశారనే విషయం స్పష్టమైందని అంటున్నారు.
This post was last modified on November 17, 2024 8:20 pm
రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిధుల సమీకరణకు కూడా..…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాత పాటే పాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సమస్యలు చూస్తే.. తన కడుపు…
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…