లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దాడి చేయించేందుకు వెనుకనుండి కేటీఆర్ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. అమాయకులను బలి చేసి తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే బీఆర్ఎస్ నాయకుల లక్ష్యమని పేర్కొన్నారు.
అంతే కాకుండా లగచర్ల ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులను విదేశాలకు పంపించారని, ఈ వ్యవహారంలో పలు ఆంతరంగిక అంశాలు ఉన్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడ్డ వాస్తవాలు కేటీఆర్ పాత్రను నిర్ధారిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నేతలు నైతిక విలువలు కోల్పోయి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం అప్పులపాలైందని, భవిష్యత్తు తరం చెల్లించలేని స్థాయికి అప్పుల మోత మిగిల్చిందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పాలనను దుయ్యబట్టిన ఆమె, ప్రజల సమస్యలను పక్కనబెట్టి తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పార్టీ పనిచేస్తోందని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ దుష్టపాలన అంతమొందించి ఏడాది పూర్తయిన సందర్భంగా లక్ష మందికి పైగా మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ సభ ద్వారా మహిళల స్ఫూర్తిని ప్రపంచానికి చాటుదామని సురేఖ పేర్కొన్నారు. అలాగే వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కొండా సురేఖ తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆమె స్పష్టం చేశారు.
This post was last modified on November 17, 2024 8:14 pm
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…