దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత నేతలే ఇప్పుడు అధినేత కేజ్రీవాల్ కు శత్రువులుగా మారుతున్నారు. ఈసారి ఏకంగా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ పార్టీలో (ఆప్) కొత్త చర్చకు తెరలేపారు. ప్రభుత్వ అవినీతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ బాటను విడిచిపోయిందని, అవినీతి పాలనలో మునిగిపోయిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో గెహ్లాట్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నేరుగా టార్గెట్ చేశారు. సీఎంగా ఉన్న కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణ కోసం రూ.45 కోట్ల ఖర్చు చేయడం ప్రజల నిధుల దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. ఆ ఖర్చును తాను సమర్థించలేనని, ఈ తరహా నిర్ణయాలు ప్రజలకు చీకటి రోజులు తీసుకువస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీ లోపలే సమస్యలున్నాయని స్పష్టం చేసిన గెహ్లాట్, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను ఆప్ రాజకీయ ప్రయోజనాల కోసం త్యజించిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతూ, అవినీతి ఆరోపణలతో నిండిన పాలనకు తాను సాక్షిగా నిలవలేనని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, గెహ్లాట్ రాజీనామా ఆప్ ప్రతిష్టపై మచ్చగా మారే అవకాశముంది.
ఇప్పటికే లిక్కర్ స్కామ్ ద్వారా పలు సమస్యలు ఎదుర్కొంటున్న ఆప్‌కు ఈ రాజీనామా కొత్త సవాళ్లు తెస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజీనామా తర్వాత గెహ్లాట్ ఏ రాజకీయ ప్రస్థానం ఎంచుకుంటారనే ఆసక్తి నెలకొంది. బీజేపీ లేదా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా, లేదా స్వతంత్రంగా ఎన్నికల్లో బరిలోకి దిగుతారా అన్న చర్చలు సాగుతున్నాయి. ఈ పరిణామాలతో ఆప్‌లో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కినట్లు కనిపిస్తోంది.
This post was last modified on November 17, 2024 8:10 pm
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…