వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరపగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే పోస్టులు పెట్టానని పోలీసులకు రవీంద్రా రెడ్డి వాగ్మూలం ఇవ్వడం సంచలనం రేపింది.
ఈ క్రమంలోనే పరారీలో ఉన్న రాఘవరెడ్డి కోసం పోలీసులు సెర్చ్ వారెంట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ఇంట్లో ఏ క్షణంలో అయినా సోదాలు చేసేందుకు అనుమతి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి కూడా పోలీసులు 41-A నోటీసులు జారీ చేశారు.
వివేకా హత్య కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తాజాగా పీఏ రాఘవ రెడ్డి రూపంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో రాఘవ రెడ్డి వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతలపై పెట్టిన పోస్టుల వెనుక రాఘవరెడ్డి ఉన్నాడని తేలిన నేపథ్యంలో అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. రాఘవరెడ్డి అరెస్ట్ అయితే ఎంపీ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 17, 2024 5:49 am
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…