Political News

ఆర్ఆర్ఆర్ సినిమాలా ఈ ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించారు: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే స్పీకర్ కుర్చీలో రఘురామను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు…రఘురామను గత ప్రభుత్వం వేధించిన వైనాన్ని వివరించారు. డిప్యూటీ స్పీకర్ గా కుర్చీ ఔన్నత్యాన్ని రఘురామ మరింత పెంచాలని, యువ నాయకులకు రఘురామకృష్ణరాజు ఆదర్శంగా నిలుస్తారని చంద్రబాబు అన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా సంచలనం సృష్టించిన రీతిలో రాజకీయాలలో ఆర్ఆర్ఆర్(రఘురామకృష్ణరాజు) సంచలనం సృష్టించారని చంద్రబాబు అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఫేమస్ అని..అదే మాదిరిగా రఘురామకృష్ణరాజు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం అంతే ఫేమస్ అని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం రఘురామను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని, పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ కు గురిచేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. అయినా సరే ఆ ఇబ్బందులను ధైర్యంగా రఘురామ ఎదుర్కొని పారిశ్రామిక వేత్తగా, రాజకీయ వేత్తగా, నేడు స్పీకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.

రఘురామను అరెస్టు చేసి తాళ్లతో కాళ్లు కట్టేసి లాఠీలు, రబ్బరు బెల్టుతో కొట్టించారని, హార్ట్ సర్జరీ చేసుకున్నారని చెప్పినా ఛాతీపై కొట్టారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు చేయమంటావా అని బూతులు తిడుతూ కొట్టారని, కోర్టులో కొట్టిన విషయం చెప్తే మళ్లీ కస్టడీలోనే చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. అయినా సరే ధైర్యంగా మెజిస్ట్రేట్ వద్ద తనను కొట్టినట్లు రఘురామ చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఎంపీ హోదాలో నరసాపురం వచ్చే పరిస్థితులు కూడా గత ప్రభుత్వంలో లేవని, ఎలాగోలా సొంత ఊరికి వచ్చేందుకు బయలుదేరితే రైలు భోగీ తగలబెట్టి మట్టుబెట్టాలని చూశారని ఆరోపించారు.

ఐదేళ్ల పాటు రఘురామ సొంత నియోజకవర్గానికి రాలేకపోవడంతో రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువయ్యారని, దేశంలో రఘురామ తరహా టార్చర్ ఘటన ఎక్కడా జరగలేదని చెప్పారు. తాను రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు తన రూములో సీసీ కెమెరాలు పెట్టి కదలికలు మానిటర్ చేయాలని చూశారని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉండటం వల్ల రఘురామకృష్ణరాజు ప్రాణాలతో బయటపడగలిగారని అన్నారు.

అన్యాయంగా రేప్ కేస్ పెట్టిన అయ్యన్నపాత్రుడుని ప్రజాస్వామ్యం స్పీకర్ ను చేస్తే..అక్రమంగా హింసించి చంపేయాలనుకున్న రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్ ను చేసిందని అన్నారు.

రఘురామకృష్ణరాజును రాష్ట్రానికి రానివ్వని వారు…ఇప్పుడు ఆయన ముందు సభలోకి వచ్చి కూర్చోలేని పరిస్థితి వచ్చిందని, ఇదే దేవుడు రాసిన స్ట్రిప్ట్ అని అన్నారు.

This post was last modified on November 15, 2024 6:29 am

Share

Recent Posts

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

54 minutes ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

3 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

3 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

4 hours ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

4 hours ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

5 hours ago