ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2.94 లక్షల కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో గృహ నిర్మాణానికి రూ.4012 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే పేదలకు ఉచితంగా ఇళ్లు, ఇళ్లపట్టాలపై సభలో పయ్యావుల కీలక ప్రకటన చేశారు.
2029 నాటికి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని పయ్యావుల అన్నారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ నగరాలు’ పథకం కింది ఆర్థికంగా వెనుకబడిన వారికి 25 లక్షల ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం..రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు ఈ పథకం ఊతం ఇస్తుంది అని అన్నారు. ఈ పథకం కింద 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని పయ్యావుల వెల్లడించారు.
This post was last modified on November 11, 2024 11:43 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…