నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిన్న రాత్రి ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఉదయానికి అది కాస్తా బ్లాక్ బస్టర్ టాక్‌గా మారిపోయింది. సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో సినిమా పెద్ద రేంజికి వెళ్లబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ట్రైలర్ రిలీజైనపుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది కానీ.. రిలీజ్ దగ్గర పడేసరికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ఊపుమీద సాగాయి. ముఖ్యంగా ప్రభాస్ మూవీ ‘రాజాసాబ్’ అంచనాలకు అందుకోకపోవడం చిరు సినిమాకు ప్లస్ అయింది. ఓవర్సీస్ ప్రి సేల్స్.. ‘రాజాసాబ్’ రిలీజ్ తర్వాతి రోజు నుంచే ఊపందుకోవడం గమనార్హం. యుఎస్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ బుకింగ్స్ మొదలైనపుడు అమ్మకాలు కొంచెం నెమ్మదిగా సాగడంతో ప్రిమియర్స్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉండవేమో అన్న సందేహాలు కలిగాయి.
కానీ రిలీజ్ దగ్గర పడేసరికి బుకింగ్స్ మాంచి స్పీడు అందుకోవడంతో చిరు సినిమా ఆశ్చర్యకరంగా ప్రిమియర్స్‌తోనేే 1 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. ఓవరాల్‌గా ప్రిమియర్స్ నుంచి 1.2 మిలియన్ డాలర్లు కలెక్ట్ కావడం విశేషం. దీని వల్ల దర్శకుడు అనిల్ రావిపూడి.. నిర్మాత సాహు గారపాటికి కారు సమర్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించి ఒక ఛాలెంజ్ గురించి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాహు వెల్లడించాడు.
ఇంతకుముందు ‘భగవంత్ కేసరి’ సినిమా హిట్టవడంతో అనిల్‌కు కారు ఇచ్చాడు సాహు. మరి చిరు సినిమాకు కూడా అలాంటిదేమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే.. ఈసారి రివర్సులో ఆయనే కారు ఇస్తాడని చెప్పాడు. కారణమేంటని అడిగితే.. యుఎస్‌లో ప్రిమియర్స్‌తో మిలియన్ మార్కు అందుకుంటే కారు ఇస్తానని అనిల్ ఛాలెంజ్ చేశాడట. తాను అది జరగదేమో అనుకుని, ఏదో ఒక ఎమోషన్లో ఛాలెంజ్ చేశాడని.. కానీ ఇప్పుడా సినిమా నిజంగానే ఆ మార్కును అందుకునేలా కనిపిస్తోందని అనిల్ అన్నాడు. ఆ అంచనాకు తగ్గట్లే సినిమా మిలియన్ ప్రిమియర్స్‌తో అదరగొట్టింది. మరి చెప్పినట్లే నిర్మాతకు అనిల్ కారు ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on January 12, 2026 5:02 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…