సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన రాగా అంచనాలు ఉన్నప్పటికీ అద్భుతాలు జరుగుతాయాని అనుమాన పడిన మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తోంది. సోషల్ మీడియా టైం లైన్ మొత్తం మెగా వైబ్స్ తో ఊగిపోతోంది.
భోళా శంకర్ తర్వాత ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ దానికి పూర్తి న్యాయం చేకూరుస్తూ విశ్వరూపాన్ని చూపించేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఈ రకమైన రెస్పాన్స్ తెచ్చుకోవడం అనిల్ రావిపూడికి కొత్త కాకపోయినా మెగా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
రేపు రవితేజ వంతు వస్తోంది. రొటీన్ మసాలా సినిమాలు చేసి అభిమానులకే విసుగు తెప్పించిన మాస్ మహారాజా ఈసారి క్లాస్ రూటు పట్టాడు. భార్య ప్రియురాలు మధ్య నలిగిపోయే పాత్రలో ఫుల్ ఫన్ ట్రై చేశారు. ఆల్రెడీ వామ్మో వాయ్యో పాట వైరల్ కాగా ట్రైలర్ అంచనాలు పెంచడంలో ఉపయోగపడింది.
అయితే మన శంకరవరప్రసాద్ గారు నుంచి జనాలను డైవర్ట్ చేయడం భర్తకు అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే చిరంజీవి సినిమా చూడాలని అధిక శాతం ప్రేక్షకులు ఫిక్స్ అయితే అపోజిషన్ లో ఉన్నవాటికి ఇబ్బందే. అందులోనూ కాంపిటీషన్ లో ఉన్నవన్నీ ఒకే జానర్ ఎంటర్ టైనర్లు కావడం అసలు ట్విస్టు.
ఈ సవాల్ ని రవితేజ కనక విజయవంతంగా పూర్తి చేస్తే రేపు చిరుతో పాటు వసూళ్లు రాబట్టుకోవచ్చు. వాల్తేరు వీరయ్యలో అన్నదమ్ములుగా నటించిన ఈ ఇద్దరు ఇప్పుడు దానికి భిన్నంగా ఇలా బాక్సాఫీస్ వద్ద కవ్వించుకోవడం వెరైటీగా ఉంది.
ఇక్కడితో అయిపోలేదు. రవితేజకు అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారితో క్లాష్ ఉంది. వాటికన్నా మెరుగైందని అనిపించుకోవడం మరో టాస్క్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే హిట్టు కొట్టినట్టే కనిపిస్తోంది కానీ జనాలు చూసి తీర్పు ఇచ్చే వరకు ఖరారుగా చెప్పలేం. డింపుల్ హయతి, ఆశికా రంగనాథన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సంగీతం భీమ్స్.
This post was last modified on January 12, 2026 5:55 pm
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…