ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలన్నీ.. వైసీపీ సోషల్ మీడియా మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మీదే నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు సంయమనంతోనే వ్యవహరించింది.
ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వ తరహాలో కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. కానీ దీన్ని అలుసుగా తీసుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పట్లాగే రెచ్చిపోతున్నారని.. టీడీపీ, జనసేన నేతలను బూతులు తిడుతూ.. ప్రభుత్వాన్ని, అధికార పార్టీలను అస్సలు లెక్క చేయనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఆ పార్టీల మద్దతుదారుల నుంచి వినిపించాయి.
ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రిత్వ శాఖ, పోలీసులు మెతకగా వ్యవహరిస్తున్నారనే విధంగా మాట్లాడ్డంతో ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. అప్పట్నుంచి వైసీపీ సోషల్ మీడియా మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి నోటీసులు వెళ్లాయి. కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం కొన్ని రోజులుగా సోషల్ మీడియా దుష్పరిణామాల మీద మాట్లాడుతున్నారు. పోలీసు చర్యలను సమర్థించుకునేలా.. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే, దారుణమైన భాషతో పోస్టులు పెట్టే వారి గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు, పిల్లల మీద దారుణమైన పోస్టుల పెట్టేవారిని సహించబోమని.. వాళ్లకు బుద్ధి చెబుతామని చంద్రబాబు నొక్కి వక్కాణిస్తున్నారు.
వైసీపీ సోషల్ మీడియా తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. అదే సమయంలో చంద్రబాబు స్వపక్షానికి కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం విశేషం. రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, పిల్లల జోలికి వెళ్తే.. హద్దులు దాటి సోషల్ మీడియా పోస్టుల పెడితే వదిలేది లేదని చెప్పిన బాబు.. వైసీపీకి చెందిన నేతల కుటుంబ సభ్యుల జోలికి వెళ్లినా కూడా ఇంతే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
హద్దులు దాటి ప్రవర్తిస్తున్న సోషల్ మీడియా జనాల వల్ల ఈ రోజుల్లో అన్ని పార్టీల వాళ్లూ బాధితులే. చంద్రబాబు ఇలా మాట్లాడడం మంచి పరిణామం. నిజంగా ఆయన మాటల్లోని చిత్తశుద్ధి చేతల్లోనూ కనిపిస్తే.. సోషల్ మీడియా విశృంఖలత్వం కొంచెమైనా తగ్గుతుందని ఆశించవచ్చు.
This post was last modified on November 10, 2024 5:50 pm
"వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం" అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఫైర్బ్రాండ్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్…
రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చర్చిస్తున్న…
ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం…
ఇద్దరు మహిళా నాయకులు పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు దక్కక ఉసూరు మంటున్న వీరు.. ఇప్పుడు నామినేటెడ్…
ఊహలు గుసగుసలదే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాశిఖన్నా. ఈ టాలీవుడ్ బ్యూటీ…