ఏపీలో సర్కారు మారింది. ప్రభుత్వ విధానాలతోపాటు.. ఆలోచనలు కూడా మారాయి. సంపద సృష్టి.. ఆదాయ వనరుల పెంపు దిశగా సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవుతోందన్న చర్చ సాగుతోంది.
తాజాగా ఏపీ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు.. వినూత్న ప్రయోగాన్ని ఆవిష్కరించింది. అదే సీ ప్లేన్ టూరిజం
అంటే.. నదులలో ప్రయాణించే విమానంతో రాష్ట్రంలో పర్యాటకానికి బూస్ట్ ఇచ్చే కార్యక్రమం. దీనిని తాజాగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించి.. తనే స్వయంగా తొలి ప్రయాణం కూడా చేశారు.
విజయవాడలోని కృష్ణానదిలో ఉన్న భవానీ ఘాట్ నుంచి శ్రీశైలం వరకు ఆయన అధికారులు, మంత్రులతో కలిసి.. సీప్లేన్‌లో పర్యటించారు. ఈ సీప్లేన్ పూర్తిగా నీటిపైనే ప్రయాణిస్తుంది. ఎక్కడైనా బ్రిడ్జిలు వస్తే.. పైకి ఎగిరి.. తిరిగి నీటిమీదకు చేరుతుంది.
ఇదొక గొప్ప అనుబూతిని కలిగించే పర్యాటక యాత్ర. దీనిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ప్రయాణించి.. విజయ వాడ నుంచి శ్రీశైలం వరకు చేరుకున్నారు. ఇదేసమయంలో ఆయన సంప్రదాయ వస్త్ర ధారణతో కనిపించడం.. టీడీపీ నేతలకు, బాబు అభిమానులకు కనువిందు చేసింది. దీనిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
రాష్ట్ర పర్యాటక రంగంలో గత టీడీపీ హయాంలోనూ అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో ప్రత్యేక బోటింగ్ విధానం తీసుకువచ్చారు. అదేవిధంగా ఏటా మూడు సార్లు.. పర్యాటక వారోత్సవాలు నిర్వహించేవారు. అదేవిధంగా హిందూ దేవాలయాలకు ఉచితం ప్రసాదం
అనే స్కీంను తీసుకువచ్చారు. పతంగుల పండుగను కూడా నిర్వహించారు.
తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు(పర్యాటక రంగంలో) చేసే కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇక, ఇప్పుడు దానికి మించిన అధునాతన వ్యవస్థను, పర్యాటకులను మంత్రుముగ్ధులను చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ప్రస్తుతం ప్రవేశ పెట్టి సీప్లేన్ పర్యాటకం దేశంలోనే తొలిది కావడం గమనార్హం.
This post was last modified on November 10, 2024 10:13 am
జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో కీలకమైనది ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి సంబంధించి నిర్మాత దిల్…
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఈ ఏడాది సెప్టెంబర్…
"వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం" అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఫైర్బ్రాండ్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్…
రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చర్చిస్తున్న…
ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం…