ఏపీ ప్రతిపక్షం వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్సీలు ఇటీవల కాలంలో బయటకు వచ్చిన విషయం తెలి సిందే. పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, సి. రామచంద్రయ్య వంటి వారు ఎన్నికలకు ముందు, తర్వాత.. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక, ఈ పరంపరలో మరో పేరు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఆయనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్. ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు ముహూర్తం రెడీ అయిందనే చర్చ సాగుతోంది.
కారణం ఏంటి?
గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి 2014 వరకు మర్రి రాజశేఖర్ హవా చలాయించా రు. 2009లో ఆయన విజయం కూడా దక్కించుకున్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే, 2019 ఎన్నికలకు వచ్చే సరికి వైసీపీ అదినేత జగన్.. ఈయనను మార్చి.. విడదల రజనీకి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే మర్రికి మంత్రి పదవి ఆశచూపారు. కానీ, రజనీకి, మర్రికి మధ్య ఆధిపత్య రాజకీయాలు చోటు చేసుకున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రజనీని నియోజకవర్గం మార్చేశారు. గుంటూరు వెస్ట్ నుంచి ఆమెకు టికెట్ ఇచ్చారు. అయితే.. కూటమి పార్టీల దూకుడు నేపథ్యంలో రజనీ పరాజయం పాలయ్యారు. దీంతో ఆమె గుంటూరు వెస్ట్ నుంచి రాజకీయాలు చేయడం ఇష్టం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. తన సొంత నియోజకవర్గం చిలకలూరి పేటకు వెళ్లిపోతానని గత కొన్నాళ్లుగా అధిష్టానం దగ్గర డిమాండ్ చేస్తున్నారు.
కీలక నాయకులతో ఉన్న పరిచయాల నేపథ్యంలో విడదల రజనీకి ఇప్పుడు మార్గం సుగమం అయింది. నేడో రేపో.. ఆమె చిలకలూరి పేట నియోజకవర్గం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది మర్రి వర్గంలో కలక లం రేపింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న రాజశేఖర్.. మరోసారి విడదల తన నియోజకవర్గంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇక, ఆమెతో రాజీపడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కుదిరితే టీడీపీ.. లేకపోతే.. జనసేనలోకి ఆయన జంప్ చేయొచ్చని మర్రి వర్గం బాహాటంగానే ప్రచారం చేస్తుండడం గమనార్హం.
This post was last modified on %s = human-readable time difference 11:38 am
ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా.. సీఎం చంద్రబాబు విజన్-2047 మంత్రాన్ని జపిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన విజన్-2047…
జాతీయ విద్యాదినోత్సవాన్ని విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ప్రభుత్వం…
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు తొలిరోజు…
ఏపీ అసెంబ్లీ సమావేశాలను సజావుగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. సభకు రాని వారి సంగతి ఏం…
వైసీపీ సోషల్ మీడియాలో విర్రవీగి.. అసభ్య పదజాలంతో దూకుడు ప్రదర్శించి.. అదే గొప్పగాఫీలైన వారి భరతం పట్టేందుకు ఏపీ ప్రభుత్వం…
ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పెన్షన్ ల పెంపు, దీపం పథకం…