అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్ కుంటిసాకులు వెతుకుతున్నారని ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన జగన్…మైక్ ఇవ్వడం లేదంటూ కారణాలు చెప్పి మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్పడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా జగన్ జీతం తీసుకోవడం దండగ అని, పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు రానని జగన్ చెప్పిన నేపథ్యంలో తాజాగా జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేని జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు, జగన్ తో పాటు శాసన సభకు హాజరు కాని మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ తమ పదవులకు రాజీనామా చేయాలని షర్మిల అన్నారు.
కాగా, అసెంబ్లీకి రాని జగన్‌కు రాజకీయ పార్టీ ఎందుకని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరెడ్డిని ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారని, బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు డిమాండ్ చేస్తున్న జగన్.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
ఇక, పులివెందులలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయని జగన్‌కు జీతమెందుకని భూమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, అలా అయిన మరో ఎమ్మెల్యే పులివెందులకు వచ్చి డెవలప్ చేస్తారని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోవడం సిగ్గుచేటని, ఎన్నికల్లో అక్రమాలు చేయడంతో జగన్ దిట్ట అని విమర్శించారు.
This post was last modified on November 8, 2024 6:40 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…