Political News

విద్యుత్ చార్జీలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. 2024-29 ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన 5 నెలల లోపు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపారి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పేదలపై విద్యుత్ చార్జీల భారానికి కారణం గత ప్రభుత్వానిదేనని చంద్రబాబు విమర్శించారు. ఒక్క యూనిట్ విద్యుత్ వాడకుండా వేల కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత గత ప్రభుత్వానిదేనని చంద్రబాబు ఆరోపించారు.

కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు చేశారని, 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి 36 వేల కోట్ల భారం ప్రజలపై వేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. జగన్ హయాంలో ఏపీకి వచ్చేందుకు పలు దేశాల పారిశ్రామికవేత్తలు భయపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి అందిన చోట అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై 10 లక్షల కోట్ల అప్పుల భారం వేశారని చంద్రబాబు ఆరోపించారు. గతంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన వైసీపీ….అందులో కీలక భాగమైన డయాఫ్రం వాల్ ను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. గతంలో కరెంటు కోతలపై పెద్ద చర్చ జరిగిందని, కానీ తాను విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ కొరత లేకుండా చేసి మిగులు విద్యుత్ తెచ్చానని చెప్పారు. అమరావతిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, ఇప్పుడు మొదలుపెట్టిన సబ్ స్టేషన్లు ఏడాదిలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. 2014లో తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి 22.5 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొరత ఉందని గుర్తు చేసుకున్నారు.

అమరావతిని జగన్ ప్రభుత్వం ఎడారిగా మార్చిందని, మద్యం తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని అక్కున చేర్చుకుని కాపాడిన ఘనత ఆడబిడ్డలకు దక్కుతుందని చంద్రబాబు అన్నారు. దుర్మార్గం, అహంకారంతో ముందుకుపోయిన వైసీపీకి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని దేశంలోనే నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెప్పారు.

This post was last modified on November 7, 2024 9:42 pm

Share

Recent Posts

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

1 hour ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

2 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

3 hours ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

3 hours ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

4 hours ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

5 hours ago