కేసీఆర్ లాగ రేవంత్ కి కూడా ఆ నమ్మకం వుందా!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాల కారణంగా మరో అవకాశాన్ని వివాదాస్పదం చేసే రీతిలో వార్తల్లో నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ కంటే ముదిరిపోయిన రీతిలో ఆయన తెరకెక్కుతున్నారు.
ఇదంతా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పలు వాస్తు మార్పులు చేపట్టినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో జరుగుతున్న. ప్రధానంగా రాకపోకల మార్గాలకు సంబంధించిన వాస్తు ప్రకారం మార్పులు చేసినట్లు వార్తలు వస్తుండటం ప్రస్తుత చర్చనీయాంశం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రధాన ద్వారాలకు వాస్తు మార్పులు చేస్తున్నారని, ఇందులో భాగంగా ఈశాన్యం వైపు ప్రధాన ద్వారం ఉండేలా మార్పులు మొదలుపెట్టారని ఇందుకు రూ.3.20 కోట్లు ఖర్చు చేయనున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై సహజంగానే విపక్షాలు ఘాటుగా స్పందిస్తున్నాయి.
మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ, `గ్రీన్ టెక్నాలజీ తో ఫైర్ సేఫ్టీ నార్మ్స్ తో దేశానికే తలమానికమైన కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తే వాస్తు పిచ్చని.. గాయ్ గాయ్ గత్తర గత్తర చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రి గా సెక్రటేరియట్ కు పూటకో మార్పు చేస్తున్నాడు. వాస్తు దోషం ఉందని ఒక్క గేట్ మార్పు చేయటానికి 4 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది కదా అసలు సిసలైన కాంగ్రెస్ మార్కు "మార్పు
అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.
మరోవైపు, సచివాలయం ప్రధాన ద్వారం, వాస్తు అంశాల విషయంలో గతంలోనే రేవంత్ రెడ్డి తన మార్కు మార్పును మొదలుపెట్టారు. ఈ ఏడాదిలో జూలైలో ఆయన మరో గేట్ గుండా సచివాలయంలోకి వెళ్లారు. మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి సింహ ద్వారం నుంచి సచివాలయానికి వెళ్లేవారు.
అయితే, జూన్ రెండో వారంలో సింహ ద్వారం నుండి కాకుండా ఎన్టీఆర్ గార్డెన్‌కు అనుకొని ఉన్న నార్త్ గేట్ నుంచి సచివాలయంలోకి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్పట్లోనే వైరల్ అయింది. దానికంటే ముందే, సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం 6వ అంతస్తులో ఉండగా దాన్ని ఇప్పుడు 9వ అంతస్తులోకి మార్చేందుకు పనులు చేపట్టినట్లు వార్తలు వచ్చాయి.
కాగా, రేవంత్ రెడ్డి తీరు చూసిన వారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు. వాస్తవంగా, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అనేక వాస్తు ఆధారిత నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా వాస్త పట్ల తన అభిమానాన్ని కేసీఆర్ ఏనాడూ దాచిపెట్టుకోలేదు. వాస్తు అంటే అంత అభిమానం, విశ్వాసం ఉన్న కేసీఆర్ కట్టించిన సచివాలయం విషయంలోనే వాస్తు మార్పులు చేయిస్తున్న తీరు చూస్తుంటే… గులాబీ దళపతి కంటే రేవంత్ రెడ్డికే మరింత విశ్వాసం ఉన్నట్లుందని పలువురు చర్చించుకుంటున్నారు.