ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను హోం మంత్రిని కాదని, ఒకవేళ తాను హోం మంత్రిని అయితే పరిస్థితి వేరేగా ఉంటుందని పవన్ వ్యాఖ్యానించడం దేశ రాజకీయాలలో కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలను పాజిటివ్ గా హోంమంత్రి అనిత తీసుకున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం పవన్ పై, సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కామెంట్ లపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తొలిసారిగా స్పందించారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అనడం ఆశ్చర్యకరంగా ఉందని జగన్ అన్నారు. సరస్వతి పవర్ భూముల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారని, 1000 ఎకరాల్లో పట్టా భూములున్నాయని, కేవలం 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, అయితే ఆ భూమిని సరస్వతి పవర్ తీసుకోలేదన్న విషయాన్ని సర్వే చేసిన ఎమ్మార్వోనే చెప్పారని జగన్ గుర్తు చేశారు. ఆనాడు గ్రామసభలో రైతులు అడిగిన రేటు కంటే ఎక్కువ ఇచ్చి కొన్నామని గుర్తు చేశారు.
సరస్వతి పవర్ కట్టకపోవడానికి టీడీపీ, కాంగ్రెస్ నేతలే కారణమని…ఆ కేసుల వల్లే ఆ భూములను ఈడీ అటాచ్ చేసిందని జగన్ ఆరోపించారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో, ఎలా మంత్రి అయ్యారో అర్థం కావడం లేదని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్ కళ్యాణ్ కు లేదని, అందుకే తాటతీస్తా, తోలు తీస్తా అంటూ సినిమా డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుందని, ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని అని, ఒక దళిత హోం మంత్రిని కాదని జగన్ అన్నారు.
అసెంబ్లీలో వైసీపీ సభ్యులకు మైక్ ఇస్తే వలన ఎండగడతామని, కానీ, మైక్ ఇవ్వడంలేదని, అటువంటప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం ఏమిటని జగన్ ప్రశ్నించారు. అందుకే ఇకనుంచి మీడియా ప్రతినిధులే నా స్పీకర్లు, మీడియా సమక్షంలోనే ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని జగన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వస్తానని చెప్పారు.
టీడీపీ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో చేసేవన్నీ ఫేక్ పోస్ట్ లని, తన సొంత తల్లిని చంపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని టిడిపి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిందని జగన్ గుర్తు చేశారు. దానిపై విజయమ్మ లేఖ విడుదల చేస్తే అది ఫేక్ అని ప్రచారం చేశారని, స్వయంగా ఆమె అది ఫేక్ లెటర్ కాదని మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి కల్పించాలని విమర్శించారు. ఓ పోలీస్ అధికారికి తన భార్య భారతి రెడ్డి ఫోన్ చేసిందని ఏబీఎన్ లో ఒక కథనం ప్రచారం అయిందని, ఆ రకంగా చూస్తే ఏబీఎన్ రాధాకృష్ణను, లోకేష్ ను అరెస్టు చేయాలని అన్నారు.
ఏది ఏమైనా మీడియా ముందు అసెంబ్లీ పెట్టి ప్రశ్నిస్తాను అన్న జగన్ పై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీడియా ముందు అసెంబ్లీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకని చురకలంటిస్తున్నారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ప్రశ్నించే హక్కు ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది కాబట్టి అసెంబ్లీకి అన్ని పార్టీల తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు వెళుతుంటారని అంటున్నారు.
This post was last modified on November 7, 2024 9:44 pm
మాళవిక మోహనన్.. రీసెంట్ గా విడుదలైన తంగలన్ చిత్రంలో యాక్షన్ పాకుడు నెగటివ్ రోల్ చేసి ఆకట్టుకున్న ఈ బ్యూటీ…
పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతని తనకు కాకుండా వేరొకరికి ఇవ్వడం పట్ల దేవిశ్రీ ప్రసాద్…
దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’…
నితిన్-రష్మి-వెంకీ కుడుముల కలయికలో వచ్చిన ‘భీష్మ’ అప్పట్లో పెద్ద హిట్టే అయింది. మళ్లీ ఈ కలయికలో సినిమాను అనౌన్స్ చేసినపుడు…
తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘యారుడీ నీ…
తమిళ కథానాయిక త్రిషకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా.. వర్షం. ఆ సినిమాతో ఒకేసారి ఆమె చాలా మెట్లు…