తెలంగాణలో రాక రాక వచ్చిన అధికారం.. అనేక ఆశలు, హామీలతో చేపట్టిన అధికారం.. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన. అంతా బాగానే ఉంది. విపక్షాల దూకుడుకు.. అడ్డుకట్ట వేస్తూ.. మాటల యుద్ధాన్ని, అభివృద్ధి పథాన్ని కూడా కొనసాగిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అయితే.. పానకంలో పుడకల్లా.. సొంత పార్టీ నాయకుల నుంచి వస్తున్న ఈటెల్లాంటి మాటలు.. పదునైన విమర్శలు ఇప్పుడు రేవంత్‌రెడ్డికి ఇబ్బందిగా మారాయని చెప్పడంలో సందేహం లేదు. దీనిలో వారు వీరు.. అనే తేడా లేదు. అందరిదీ ఒకే మాట అన్నట్టుగా సీనియర్లు.. జూనియర్లు కూడా రెచ్చిపోతున్నారు.
నిజానికి తమ ప్రభుత్వాన్ని తామే కాపాడుకోవాలన్నది ఏ పార్టీలో ఉన్న ప్రాధమిక సూత్రమైనా చెబుతుంది. కానీ, అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్న నేతలను, ముఖ్యమంత్రిని కూడా టార్గెట్ చేస్తూ.. చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు.. తలకో మాట అనేయడం.. కామన్‌గా మారింది. తద్వారా ఎదురయ్యే సమస్యలను వారు పరిగణనలోకి తీసుకోకుండా.. తమ తోచినట్టే వ్యవహరిస్తున్నారు. దీంతో ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న ఆర్యోక్తి.. నాయకులకు వర్తిస్తుండడం గమనార్హం.
ఎవరెవరకు.. ఎప్పుడెప్పుడు?
మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి.. ఇటీవల కాలంలో ఫిరాయింపులను తప్పుపడుతున్నారు. అసలు ఫిరాయింపులు లేని పార్టీ అంటూ ఏదైనా ఉందేమో రెడ్డిగారికే తెలియాలి. కానీ, తన పీఠానికి ఎక్కడ ఎసరు వస్తుందని భావిస్తున్నారో ఏమో.. ఆయన ఫిరాయింపులను పక్కాగా తప్పని చెబుతున్నారు. రొడ్డెక్కినిరసనలు కూడా చేస్తున్నారు. అధిష్టానానికి అగ్రతాంబూలా లంటూ.. విమర్శల జడిలో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్‌ని ఆదర్శంగా తీసుకోవాలా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఇక, హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు ఎలానూ నిత్యం విమర్శలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో తాను కూడా తగుదునమ్మా.. అంటూ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ హైడ్రా, మూసీ విషయంలో తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఒకవైపు మూసీ బాధితులను ఆదుకుంటామని సర్కారే చెబుతున్నా.. ప్రతిపక్ష నాయకుడికి పరాకాష్టగా మారిన యాష్కీ.. తానే అండగా ఉంటానని.. న్యాయం చేపిస్తానని చెబుతూ.. సర్కారును, ముఖ్యమంత్రిని కూడా ఇరకాటంలోకి నెడుతున్నారు.
మంత్రి కొండా సురేఖ కూడా ప్రభుత్వాన్ని బద్నాం చేసేలానే వ్యవహరించారు. అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేయడం దరిమిలా.. ఆమె కంటే కూడా సర్కారుపైనే పెద్ద ఎత్తున విమర్శలు రావడం గమనార్హం. అదేసమయంలో తీన్మార్ మల్లన్న నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి.. ఎమ్మెల్సీ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకు అలవాటు పడినట్టుగా ఉన్నారు. దీంతో ఆయన కూడా.. సర్కారును ఇబ్బంది పెట్టేలానే వ్యవహరిస్తున్నారు.
“రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి రెడ్డి ముఖ్యమంత్రి” అని వ్యాఖ్యానించారు. ఇలా ఎవరికి నచ్చినట్టు ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు చేస్తే.. పైనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎలా సర్దుబాటు చేయాలన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపథ్యంలో అధిష్టానం జోక్యం చేసుకుని.. నేతలను కంట్రోల్ చేయడమో.. కంట్రోల్ అయ్యేలా వారిని లైన్‌లో పెట్టడమో చేయాల్సి ఉంది.
This post was last modified on November 6, 2024 9:43 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…