మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి వరకు అంటే ఐదు మాసాలకు సంబంధించి 90- లక్ష కోట్ల రూపాయల తో ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే.. ఈ సమావేశాలకు వైసీపీ వస్తుందా? రాదా? అనేది ఒకవైపు చర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. ఈ సమావేశాలకు ముందే.. వైసీపీకి భారీ షాక్ ఇచ్చేందుకు టీడీపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారని తెలిసింది. టీడీపీ కేంద్ర కార్యాలయం(మంగళగిరిలో) వ్యవహారాలను చూసే ముఖ్య నాయకుడు అత్యంత గోప్యంగా చెప్పిన విషయాన్ని బట్టి.. సీమ నుంచి ఒక ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారని తెలిసింది. ఇప్పటికే చర్చలు కూడా అంతర్గతంగా పూర్తయ్యయని అంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వీరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, వారి చేరిక ఖాయమనికూడా సదరు నాయకుడు వెల్లడించడం గమనార్హం. అయితే.. ముహూర్తం మాత్రం అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి కారణం.. సమావేశాల్లో సంచలనం సృష్టించాలని.. వైసీపీకి వాయిస్ లేకుండా తనను తాను రక్షించుకునే స్థితిలో పడిపోవాలన్నది వ్యూహంగా ఉంది. ఇది ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న జగన్‌కు మరింత ఇబ్బందిగా మారనుందని అంటున్నారు.
ఇంటా బయటా సమస్యలతో జగన్ ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరింతగా ఈ సమస్య పెరుగుతుందని అంటున్నారు. నిజానికి ఎలాంటి సంచలనాలు లేకపోతే.. వైసీపీ ప్రస్తుత సమస్యలపై సభలో నిలదీసే అవకాశం ఉంది. కానీ, వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా.. ఆ పార్టీని మరింత ఇరకాటం లోకి నెట్టాలన్నది కూటమి పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే వైసీపీ నుంచి వస్తామని చెబుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకునేందుకు రంగం రెడీ అయినట్టు సదరు నేత చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates