తెలంగాణ రాజకీయాల్లో అప్రకటిత మిత్రపక్షాలుగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోపాటు.. రాజకీయ రచ్చను రోడ్డెక్కిస్తున్నారు. ఈ పరిణామాలు.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న మిత్రబంధాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కూడా.. ఎంఐఎంతో బీఆర్ ఎస్ చెలిమి అందరికీ తెలిసిందే.
ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో అసలు పోటీ కూడా పెట్టకుండానే బీఆర్ఎస్ వ్యవహరించింది. వాటిని ఎంఐఎం సునాయాసంగా గెలుచుకుంది. అదేవిధంగా ఎంఐఎం ఎదుగుదలకు కూడా అడ్డు పడకుండా చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు అప్పట్లో మంత్రులకు కూడా అవకాశం లభించని విషయం తెలిసిందే. కానీ, ఎంఐఎం అధినేత సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. బీఆర్ ఎస్ నేతను నేరుగా ప్రగతి భవన్‌లోనే కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి.
అలాంటి రెండు పార్టీల మధ్య ఇప్పుడు వివాదాలు చోటు చేసుకున్నాయి. మేం లేకపోతే.. బీఆర్ఎస్‌కు 2023లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ దక్కి ఉండేదా? అంటూ.. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేపడుతున్న మూసీ ప్రక్షాళనకు ఆయన పరోక్షంగా మద్దతు ఇచ్చారు. మూసీ సుందరీకరణకు బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదనడం ద్వారా బీఆర్ఎస్‌ను ఆయన విమర్శల గోదాలోకి నెట్టారు.
అక్కడితో కూడా ఆగకుండా.. బీఆర్‌ఎస్ పార్టీ జాతకం అంతా మా దగ్గర ఉందంటూ మరో బాంబు పేల్చారు. మేము నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. తద్వారా.. ఒవైసీ.. బీఆర్ ఎస్ విషయంలో తన వైఖరిని చెప్పకనే చెప్పినట్టు అయింది. ఈ మొత్తానికి కారణం.. హైడ్రా అనే చర్చ జరుగుతోంది. చెరువులను ఆక్రమించి కట్టారన్న విమర్శలు ఉన్న ఒవైసీ కాలేజీలను కూల్చేందుకు రంగం రెడీ అవుతున్న నేపథ్యంలో యూటర్న్ తీసుకున్నారని బీఆర్ ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. పైగా మరో నాలుగేళ్లపాటు.. బీఆర్ ఎస్‌తో ఎలానూ పని లేదు. కాబట్టి.. ఒవైసీ ఇలా వ్యాఖ్యానిస్తున్నారన్న చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 4, 2024 11:54 am
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…