గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి పార్టీల మధ్య చర్చగా మారింది. ఈ విషయాన్ని మంత్రులు పదే పదే కూడా చెబుతున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు.. వేసిన అడుగులు కూడా.. ఏపీ అభివృద్ధికి, లేదా.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రతిబంధకాలుగా మారాయని అంటున్నారు. కీలకమైన ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాల వరకు కూడా.. ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
రుషికొండ: విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషి కొండపై వైసీపీ హయాంలో రూ.500 కోట్లను వెచ్చించి చేసిన నిర్మాణం.. ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారింది. దీనిని ఉంచుకునేందుకు.. అవకాశం లేదు. అమ్మేందుకు అవకాశం లేదు. పైగా గ్రీన్ ట్రైబ్యునల్ సహా హైకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. వీటికి నెల నెలా ఖర్చులు పెట్టాల్సి ఉంది. ఇక, ఈ నిర్మాణం మెయింటెనెన్స్‌కు కూడా నెలకు రూ.6 లక్షల వరకు సర్కారు వెచ్చిస్తోంది.
పోలవరం: పోలవరం వంటి కీలక ప్రాజెక్టు విషయంలో వైసీపీ హయాంలో ఎత్తును తగ్గిస్తూ.. చేసిన నిర్ణయం కూడా ఇప్పుడ కూటమి సర్కారును ఇరకాటంలో పడేసింది. జగన్ ఒప్పుకొన్నారు.. ఇప్పుడు మీరు ఎందుకు మెలిక పెడుతున్నారంటూ.. కేంద్రం పెద్దలు .. ఎత్తు విషయంలో ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో 41.86 మీటర్లే దీనిని పరిమితం చేసి ముందు నిర్మాణం అయ్యేలా చేస్తారు. అనంతరం.. సర్కారు సొంత నిధుల నుంచి మిగిలిన 4 మీటర్ల ఎత్తును నిర్మించనుంది.
అమరావతి: ఐదేళ్ల వైసీపీపాలనలో రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో ఇక్కడ పెరిగిన తుమ్మ, పిచ్చి మొక్కలు తొలగించేందుకు ఏకంగా 40 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా రహదారులు తొవ్వేశారు. ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేశారు. ఇళ్లకు గోడలు కొన్ని చోట్ల బీటలు వచ్చాయి. నిర్మాణాలు బాగానే ఉన్నా.. ఫ్లోరింగ్ ధ్వంసమైంది. ఇలా.. మరో 200 కోట్ల వరకు వెచ్చించి.. వాటిని బాగు చేసుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
రోడ్లు: గత ఐదేళ్లలో వైసీపీ సర్కారు రహదారుల బాగుచేత, నిర్మాణాలపై దృస్టి పెట్టలేదు. దీంతో ఇప్పుడు వాటిని బాగు చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయల వరకు(కేవలం అతుకులు వేసేందుకే) ఖర్చు చేయాల్సివస్తోంది. అవే వైసీపీ హయాంలోనే బాగు చేసి ఉంటే.. ఇప్పుడు ఆ నిధులను కొత్త వాటికి వినియోగించేవారు. ఇలా.. అనేక అంశాల్లో వైసీపీ పాలన చేసిన చెడును కడిగేందుకు.. చంద్రబాబు పరీక్షలు ఎదుర్కొంటున్నారని.. కూటమి పార్టీల నాయకులు చెబుతున్నారు.
This post was last modified on November 3, 2024 10:21 pm
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు…