Political News

లోకేష్ కు రాజకీయాలు వద్దన్న బ్రాహ్మణి ఎలా కన్విన్స్ అయ్యారు?

అమెరికాలోని లాస్‍వేగాస్‍లో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ అలైన్స్ సినర్జీ సమ్మిట్‍-2024’’లో ఏపీ ఐటీ శాఖా మంత్రి మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆ తర్వాత సదస్సులో లోకేష్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తనను రాజకీయాల్లో కొనసాగవద్దు అని తన భార్య బ్రాహ్మణి తనతో చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు.

రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులుంటాయని, అవసరమా అని బ్రాహ్మణి తనను చాలాసార్లు అడిగిందని, ప్రత్యేకించి చంద్రబాబు గారి అరెస్టు సమయంలో కుటుంబం బాగా ఇబ్బంది పడిన సమయంలో బ్రాహ్మణి, తాను చాలా ఆవేదన చెందామని చెప్పారు. కానీ, హైదరాబాద్ లో 45 వేల మంది ఐటీ ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా బాబు గారికి మద్దతుగా నిలిచారని, అది చూసిన తర్వాత బ్రాహ్మణి తాను రాజకీయాలలో కొనసాగడం గురించి ప్రశ్నించలేదని అన్నారు.

ఇక, అమెరికాలోని పలు నగరాల్లో చాలామంది ఎన్నారైలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల కోసం, ప్రజల కోసం ఇంత త్యాగం చేశాం అయినా అక్రమ అరెస్టులు తప్పలేదు…అని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేసిందని, కానీ, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారికి వస్తున్న మద్దతు చూసి తన నిర్ణయం మార్చుకుందని అన్నారు.

45 ఏళ్ళు ప్రజల కోసమే పని చేసిన చంద్రబాబు గారిని, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రజలందరూ చంద్రబాబు గారి కోసం నిలబడిన తీరు చూసిన తర్వాత తమ కుటుంబం ఆ అభిప్రాయం మార్చుకుందని చెప్పారు. కష్టాల్లో చంద్రబాబు గారి కోసం నిలబడ్డ ప్రజల కోసం తాము పని చేస్తూనే ఉంటామని అన్నారు.

This post was last modified on October 30, 2024 6:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజమండ్రి లో ఇద్దరు గేమ్ ఛేంజర్లు!

జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో కీలకమైనది ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి సంబంధించి నిర్మాత దిల్…

20 mins ago

రాయల్ హరివిలువల్లా మెరిసిపోతున్న సిద్ధార్థ్, అదితి!

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఈ ఏడాది సెప్టెంబర్…

33 mins ago

వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం: ఆర్ ఆర్ ఆర్‌

"వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం" అని అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌, ఫైర్‌బ్రాండ్ ర‌ఘురామ కృష్ణ‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

2 hours ago

ఆ కేంద్ర మంత్రుల భేటీలో పవన్ ఏం చెప్పారు?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్…

2 hours ago

ష‌ర్మిల‌తో ఏపీ కాంగ్రెస్‌కు ఫ్యూచ‌ర్ లేదా..?

రాష్ట్రంలో కాంగ్రెస్ భ‌విత‌వ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే ప‌రిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు చ‌ర్చిస్తున్న…

3 hours ago

దేవీ వాఖ్యలపై మొదటిసారి స్పందించిన పుష్ప నిర్మాత!

ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం…

3 hours ago