తెలంగాణలో జున్వాడలోని మాజీ మంత్రి కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిన వ్యవహారం రాజకీయంగా మలుపులు తిరుగుతోంది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎక్సైజ్ అధికారులు రాజ్ పాకాల బ్రడర్స్ ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. రాయదుర్గంలోని వారి విల్లాల్లో తనిఖీలకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారు. ఏ ఆధారాలతో విల్లాలను తనిఖీ చేసేం దుకు వచ్చారని ఎక్సైజ్ అధికారులను గద్దించారు.
బీఆర్ ఎస్ నాయకులు వివేకానంద, బాల్క సుమన్‌లు.. ఎక్సైజ్ పోలీసులనుఅ డ్డుకునే ప్రయత్నం చేశా రు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. చివరకు వివేకానంద, బాల్క సుమన్‌లను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అనంతరం తనిఖీలు చేపట్టారు. కాగా… ఈ తని ఖీలు జరుగుతున్నంత సేపు.. బీఆర్ ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇదిలావుంటే.. జున్వాడ ఫామ్ కేసులో ఏ2గా రాజ్ పాకాలను చేర్చినట్టు అధికారులు తెలిపారు.
అదేవిధంగా ఫామ్ హౌస్ నుంచి ఖరీదైన కర్ణాటక లిక్కర్ సహా ఫారిన్ లిక్కర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సుమారు 7 లీటర్ల వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతం రాజ్ పాకాల కోసం తమ బృందాలు గాలిస్తున్నట్టు చెప్పారు.
రేవ్ పార్టీ కాదు.. దీపావళి కానుక
ఇక, ఈ వ్యవహారంపై బాల్క సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జున్వాడ ఫామ్ హౌస్‌లో జరిగింది రేవ్ పార్టీ కాదన్నారు. కేవలం దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులకు చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్నార ని.. దీనిని కూడా రేవ్ పార్టీ అంటారా? అని ప్రశ్నించారు. అయితే.. కొకైన్ సేవించిన ట్టు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఇది ఉద్దేశ పూర్వకంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు చేసిన చర్యగా ఆయన పేర్కొన్నారు.