సినిమాలకు బజ్ ఉండటం సహజం కానీ ఒక ఓటిటి టాక్ షో కోసం ప్రేక్షకులు ఎదురు చూడటం అరుదు. దాన్ని ఆన్ స్టాపబుల్ చేసి చూపించింది. బాలకృష్ణ మొదటిసారి సెలబ్రిటీ యాంకర్ గా మారిపోయి మొదలుపెట్టిన ఈ ట్రెండీ ఇంటర్వ్యూ పర్వం మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో భాగంలోకి అడుగు పెట్టింది. లాంచ్ ఎపిసోడ్ ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని గెస్టుగా తీసుకురావడంతో అంచనాలు పెరిగాయి. అందుకే ఈ బావా బావమరిది కాంబినేషన్ రెండోసారి అయినప్పటికీ రాజకీయ సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని తీసుకొచ్చింది.
ఇక హైలైట్స్ విషయానికి వస్తే బొబ్బిలి సింహం కాస్ట్యూమ్ లో విజయరాఘవ భూపతిగా బాలకృష్ణ మరోసారి ఆ సినిమాలోని పవర్ ఫుల్ ఎపిసోడ్ ని రీ క్రియేట్ చేయడం బాగా పేలింది. చంద్రబాబుని పరిచయం చేశాక ఇద్దరి మధ్య ఆత్మీయ ఆలింగనం, బాలయ్య అన్స్టాపబుల్ ఓత్ పేరుతో పుస్తకం మీద ప్రమాణస్వీకారం చేయించడం సరదాగా జరిగాయి. ముచ్చట్లలో భాగంగా చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కలిగిన మానసిక స్థితి, కుటుంబంతో పాటు జనంలో కలిగిన ఆవేదన, విషమ పరిస్థితుల్లో కారాగారానికి వచ్చి పవన్ కళ్యాణ్ తెలిపిన మద్దతు ఇవన్నీ ప్రస్తావనకు వచ్చి వివరంగా పంచుకున్నారు.
కొన్ని సరదా కబుర్లు దొర్లాయి. రొమాంటిక్ లేదా కామెడీ సినిమాల్లో ఏదంటే ఇష్టమని బాబుగారిని ఆగడటం, భువనేశ్వరి – బ్రాహ్మణి మధ్య పోలిక, వీడియో ద్వారా దేవాన్ష్ ప్రశ్నలు, 500 రూపాయలతో సూపర్ మార్కెట్ షాపింగ్ ఎలా చేస్తారని దాన్ని రియలిస్టిక్ గా చూపించడం ఇవన్నీ ఫన్ మోడ్ లో నడిపించారు. 1 గంట 15 నిమిషాల నిడివిలో పలు వీడియోలు, విజువల్స్ ని ప్రదర్శింపజేయడమే కాక వచ్చిన ఫ్యాన్స్ నుంచి కొందరికి చంద్రబాబుతో ప్రశ్నల రూపంలో సంభాషించే అవకాశం కలిగించారు, భావోద్వేగాలు, సరదాలు, రాజకీయ ప్రణాళికలు అన్నీ సమపాళ్ళలో సమకూరిన అన్స్టాపబుల్ 4 తొలి అడుగు ఘనంగానే పడింది.
This post was last modified on October 26, 2024 7:39 pm
ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న పైరసీ గురించి కొత్తగా చెప్పేందుకు ఏమి లేదు కానీ నిన్నా మొన్నటిదాకా ఇవి…
'ప్రేమ కోసమే వలలో పడినె పాపం పసివాడు' అంటూ అప్పటి పాతాళ భైరవి సూపర్ హిట్ పాట.. ఇప్పటి తరానికి…
ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ కోసం తెలుగులోనే కాదు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ బజ్ కనిపిస్తోంది.…
గత ఏడాది భారతీయుడు 2 రిలీజైనప్పుడు దర్శకుడు శంకర్ కెరీర్ లోనే మొదటిసారి విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. ఐ,…
ఏదో క్యాస్టింగ్ పెద్దగా లేని సినిమా ల్యాబ్ లో మగ్గుతుందంటే సహజం అనుకోవచ్చు. కానీ పేరున్న హీరో, ఇమేజ్ ఉన్న…
అవును.. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చదివినంతనే.. యమలోకంతో కనెక్షన్ ఉండే చాలా సినిమాలు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. నూకలు తీరకుండానే…