ఏపీ మాజీ సీఎం జగన్ అమరావతి రాజధానిపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంపై కుల ముద్ర వేసిన జగన్…ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపేశారు. దీంతో, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన అపఖ్యాతి ఏపీ మూటగట్టుకుంది.
అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు అమరావతికి ఊపిరి పోశారు. ఆగిపోయిన నిర్మాణాలను మళ్లీ మొదలుబెట్టే ప్రక్రియలో భాగంగా అమరావతిలో పెరిగిపోయిన పిచ్చి చెట్లు, మొక్కలను యుద్ధ ప్రాతిపదికన తీయించారు. అమరావతిలో జగన్ వల్ల ఏర్పడిన అడవిలోని చెట్లను, మొక్కలను నరికివేసిన తర్వాతే అమరావతి కొత్త రూపు సంతరించుకుంది.
ఇలా, ఓ వైపు అమరావతిని పునర్నిర్మించే పనిని సమర్థవంతంగా చేస్తూనే మరోవైపు అమరావతిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు తన మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నొవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎకోసిస్టమ్, మెంటార్ స్టార్టప్స్ గురించి ఈ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రతిదాన్ని ప్రముఖ బిజినెస్ గ్రూప్స్ మెంటార్ చేస్తాయని, డెవలప్ అవుతున్న సెక్టార్లలో టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్ కు కృషి చేస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని ఐదు జోనల్ సెంటర్లతో ఈ హబ్ అనుసంధానమై ఉంటుందని వెల్లడించారు. మరోవైపు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ సంస్థను విశాఖలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతితో పాటు విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా లోకేష్ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 25 నుంచి అక్టోబర్ 1 వరకు అమెరికాలో లోకేష్ పర్యటించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates