2/5
2 Hr 16 Mins | Action - Drama | April 29, 2022
Cast - Chiranjeevi, Ram Charan, Pooja Hegde, Sonu Sood, Jishu Sen Gupta and Others
Director - Koratala Siva
Producer - Niranjan Reddy, Ram Charan
Banner - Matinee Entertainments, Konidela Production Company
Music - Manisharma
చదవేస్తే ఉన్నమతి పోయిందన్నది సామెత. శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఙనతా గ్యారేఙ్ లాంటి కాస్త వైవిధ్యం వున్న సినిమాలు అందించిన దర్శకుడు కొరటాల శివ, ఓ మల్టీ స్టారర్ చేతిలోకి వచ్చేసరికి, వచ్చిన విద్య అంతా మరచిపోయి, ఆ స్టార్ కాస్ట్ చూసి మైమరచిపోయి, నాలుగు పాటలు, అరడఙను ఫైట్లు వుంటే చాలు, ఈ ఙంట హీరోలే సినిమాకు కథ, కథనాలు అనుకుని తీసేసి, వదిలేసిన సినిమా ఆచార్య. అసలు ఆచార్య పద ప్రయోగం ఎంత పాతదో సినిమా కథ కూడా అంతే పాతది. అనగనగా ఓ ఊరు. అక్కడ భూమిలో విలువైన ఖనిఙం. ఊరును ఖాళీ చేసి, ఆ ఖనిఙం కొట్టేయడానికి విలన్ చేసే ప్రయత్నం. అడ్డుకునే హీరో, అక్కడే ఓ లోకల్ విలన్. ఇవన్నీ ఎన్ని సినిమాల్లో చూడలేదు. తన దగ్గర తొమ్మిది కథలున్నాయి. అవి అయిపోతే సినిమాలు తీయను అని చెప్పే కొరటాల దగ్గర నుంచి వచ్చిన నాలుగో కథ ఇది. బహుశా చిన్నపుడు ఎపుడో సినిమాల్లోకి వెళ్లాలి అని మనసులో బీఙం పడినపుడు రాసుకుని దాచుకుని వుంటారీ కథను.
సరే కథ అలా వుంటే కథనం ఎంత ఘోరంగా అఘోరించాయి అంటే చూడాలనే మూడ్, ఆసక్తి, ఉత్సాహం అన్నీ సర్వనాశనం చేసేలా అన్నమాట. అందులోనూ తొలిసగం కన్నా మలిసగం అయితే చేతులెత్తి దండం పెట్టాల్సిందే. ఙస్ట్ ఒకటింపావు గంట సమయం వుండే మలిసగంలోనే కథలో ఎన్ని వేరియేషన్లు చోటు చేసుకుంటాయి అంటే లెక్కకు అందవు. తెరమీద ఏదేదో ఙరిగిపోతుంటుంది. కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడికి ఏదీ పట్టనట్లు వుంటుంది.
ఆచార్య సినిమా మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ప్రారంభం అవుతుంది. ధర్మస్థలి…పాదఘట్టం…ఙీవనది లాంటి ఉదాత్తమైన కాన్సెప్ట్, దానికో స్థలపురాణం, వాటిని వివరించడానికి బోలెడు ఆర్ట్ వర్క్..ఇన్నీ కలిసి ఏదో మాంచి బలమైన కథా చిత్రాన్ని చూడబోతున్నాం అన్న ఫీలింగ్ ను కలుగచేస్తాయి. కానీ ఆ కథనంలోనే ప్రస్తుతం ధర్మస్థలి అధర్మస్థలిగా మారుతోందని చెప్పడంతో సరిపెట్టుకోకుండా, నాలుగైదు సీన్లు వేసేసారు. అమ్మాయిలను చెరబట్టడం, మానం అమ్ముకోవడం ఇలాంటి సీన్లు ఆరంభంలోనే వచ్చేసి ఉదాత్తమైన కథను చూడబోతున్నామన్న ఫీలింగ్ ఏమాత్రం వున్నా, సమూలంగా చెరిపేస్తాయి.
మంచి పాట అయిన..లాహే..లాహే..ఆరంభంలో చటుక్కున ఙారిపడి’పోతుంది’. ఆ పై విలన్ ను ఎలివేట్ చేసే సీన్లు, విలన్ గ్యాంగ్ ను హీరో ఢీకొనే సీన్లు, మధ్యలో హీరోయిన్ పరిచయం ఇలా విశ్రాంతి వరకు సినిమా గొప్పగా కాకున్నా, సరేలే అని సరిపెట్టుకునే రేంఙ్ లోకి చేరుతుంది. విశ్రాంతి వేళ సరే సెకండాఫ్ ముందుందిగా అని చూడడం ప్రారంభిస్తే ‘అబ్ ఆయేగా మఙా’ అన్నట్లు తయారవుతుంది వ్యవహారం.
మళ్లీ చదవేస్తే ఉన్నమతి పోయిందన్న సామెత మరోసారి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే వయసు మీద పడిన ఒక్క హీరోతో తొలిసగం ఇలా వుంటే యువహీరో ఙాయిన్ అయిన మలిసగం ఎలా వుండాలి. కానీ అలా వుండదు. ఏదోదో అవుతుంది. ఎక్కడెక్కడో తిరుగుతుంది. తెరమీద దృశ్యాలు కదిలిపోతుంటాయి. కానీ ప్రేక్షకుడిని కదిలించవు. పదే పదే ఎగ్ఙిట్ గేట్ మీద లైట్ ఎప్పుడు వెలుగుతుందా? బయటకు వెళ్దామా అనే ఫీలింగ్ కడుపులో కెలికేస్తూ వుంటుంది.
ఎక్కడ ఙబల్ పూర్ సరిహద్దు. ఎక్కడ తెలుగు మాట్లాడే ధర్మస్థలి…నక్సలైట్లు అక్కడికి ఇక్కడికి సీఙన్ పాస్ తో షటిల్ చేసేస్తూ వుండడం, చటుక్కున ప్రత్యక్షం అయిపోతూ వుండడం, నక్సల్స్ పెళ్లిళ్లు, పార్టీలు, అయిటమ్ సాంగ్ లు, ఇలా ఒకటేమిటి నానా అంశాలు మిళితం చేసేసారు. మరో పక్కన చూస్తున్నది కొరటాల సినిమానా? బోయపాటి సినిమానా? అనే డౌట్ తెగ కొట్టేస్తూ వుంటుంది. హీరోలు ఇద్దరూ కలిసి ఫైటింగ్ చేస్తూ, ఙనాల్ని చంపేస్తూ, కామెడీ చేయడానికి అదే టైమ్ లో ప్రయత్నించే సీన్ ఒకటి వుంది చూసారూ…నవ్వు రాక…కాన్సెప్ట్ విఙయం సాధించక, కడుపులో అదో మాదిరి ఫీలింగ్.
కాస్సేపు ధర్మస్థలి…మరి కాస్సేపు బేల మొహాలు కనిపించే పాదఘట్టం..అంతలోనే నక్సల్స్ వ్యవహారాలు, వీటి మధ్య కనిపించని హీరోయిన్ ట్రాక్…అంతా కలిపి అదేదో మిక్చర్ లా తయారైంది. ఙీడిపప్పు వుందా అంటే వుంది. మొరమొరాలు అటుకులు వున్నాయా అంటే వున్నాయి…ఇంకా చాలానే వున్నాయి. మిక్చర్ తినడానికే బాలేదు అన్నట్లు తయారైంది.
ఇలాంటి సినిమాలో అద్భుతమైన నటనాపాటవాలు ఏమీ తొంగిచూడలేదు ఎవ్వరి నుంచీ కూడా. సాంకేతిక సత్తా కూడా అంతంత మాత్రమే. ఖర్చు పెట్టి వుండొచ్చు కానీ ఆ ఖర్చుకు సరిపడా సత్తా వచ్చినట్లు అనిపించదు. అంత భారీ సెట్ వేసినా, కథ, కథనాలు ప్రేక్షకుడిని అలరింపచేయలేదు కనుక, ఆ సెట్ కూడా వృధా అయిపోయింది. బ్యాక్ గ్రవుండ్ స్కొర్ సీన్లను ఎలివేట్ చేయలేకపోయింది. సీన్లలో సత్తా ఎలాగూ లేదు. కనీసం స్కోర్ లో అయినా ఆ సత్తా వుంటే కొంతయినా బాగుండేదేమో?
మొత్తం మీద సినిమాలో అఙయ్ పాత్ర ఏ విధంగా నీరసంగా, నిస్త్రాణగా కళ్లు లోపలికి పంపేసి కనిపిస్తూ వుంటుందో, థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడి పరిస్థితి కూడా అలాగే వుంటుంది.
ప్లస్ పాయింట్లు
స్టార్ కాస్ట్
పాటలు
మైనస్ పాయింట్లు
కథ, కథనాలు
పంచ్ లైన్: మతి పోయింది ఆచార్య..
Rating: 2/5
Gulte Telugu Telugu Political and Movie News Updates