Movie Reviews

సమీక్ష-శ్రీదేవి సోడా సెంటర్

తరతరాలుగా సినిమాకు ప్రేమ అనే ముడిసరుకు, దానికి కులం..మతం..డబ్బు అంతరాలు అనే అదనపు తాలింపు కీలకంగా వుంటూ వస్తున్నాయి. అయితే మనకు వరల్డ్ సినిమా ఎక్స్ పోజర్ దొరికే వరకు అన్నీ సుగర్ కోటెడ్ సినిమాలే. తమిళ సినిమాల మాదిరిగా రగ్డ్, రా సినిమాలు తక్కువ. కానీ కొత్త నెత్తురు వస్తోంది. కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి. జనం యాక్సెప్టెన్సీ మీద ధైర్యం పెరుగుతోంది. ఆ ధైర్యంతోనే వచ్చి హిట్ కొట్టాయి రంగస్థలం, ఉప్పెన వంటి సినిమాలు.

పలాస లాంటి చిన్న సినిమాను తీసిన దర్శకుడు కరుణకుమార్ తమ మలిప్రయత్నంగా మరోసారి అలాంటి ప్రయత్నమే కాస్త భారీ స్థాయిలో చేసారు. అదే ఈవారం విడుదలయిన శ్రీదేవి సోడా సెంటర్. తొలిసినిమా ఉత్తరాంధ్ర పలాస నేపథ్యంలో తీస్తే, మలి సినిమా తూర్పుగోదావరి అమలాపురం నేపథ్యంలో తీసారు. అది చిన్న సినిమా ఇది కాస్త భారీ సినిమా. అంతే తేడా. సహజత్వం, రఫ్ నెస్, డ్రామా, బోల్డ్ ఎటెంప్ట్, కులాల గొడవలు ఇలా మిగిలినవన్నీ సేమ్ టు సేమ్.

రియలిస్టిక్ సినిమా అనేది చిన్నగా అన్నా తీయాలి లేదా. పెద్దగా తీయాలంటే పెద్ద పేర్లు అన్నా యాడ్ కావాలి. ఈ రెండింటికన్నా కీలకమైన విషయం విషయం వుండి డ్రామా వుంటే నచ్చుతుందేమో, నప్పుతుందేమో కానీ, విషయం లేకుండా లేదా కొత్తది కాకుండా కేవలం డ్రామా వుంటే, బోర్ కొడుతుంది. దర్శకుడు కరుణ కుమార్ దగ్గర విషయం వుంది. అందులో సందేహం లేదు. కానీ అతను ఎంచుకున్న సబ్జెక్ట్ లో విషయం లేదు.

ఒక ఊరిలో అమ్మాయి..అబ్బాయి ప్రేమించుకున్నారు. కులాలు అడ్డం పడ్డాయి. అంతట్లోనే విలన్ జోక్యం. అబ్బాయి జైలుకు వెళ్లాడు. అమ్మాయి కి వేరే పెళ్లి చేసారు. అమ్మాయి వినలా..తిరగబడింది. తండ్రికి కోపం వచ్చింది. కూతురుకున్నా, కులం గోత్రం, పరువు అన్నీ ముఖ్యం అనుకున్నాడు. ఇదీ కథ.

రంగస్థలంలో ఆది పినిశెట్టి లవ్ స్టోరీకి కావచ్చు. ఉప్పెనలో ఆసి-బేబెమ్మల ప్రేమ కథ కావచ్చు. ఇదే కదా? మరి శ్రీదేవి సోడా సెంటర్ లో కొత్తదనం ఏమిటి? రొటీన్ సోడా కాకూడదు కదా? నిమ్మకాయ సోడాగానో? కలర్ సోడాగానో మార్చగలగాలి. అంతే తప్ప ఆ సినిమాలే మరో స్టార్ కాస్ట్ తో చూపిస్తే జనం ఎలా మెచ్చుకుంటారు. సరే, పోనీ బాగా తీస్తే మెచ్చుకుంటారులే అని అనుకోవడానికి సన్నివేశాలు అన్నా కొత్తగా రాసుకోవాలి కదా? తిరనాళ్లలో అమ్మాయిలను ఏడిపించడం, గొడవలు, హీరోయిన్ మీద ఊర్లో పెత్తందారు కన్నేయడం ఇలా రొటీన్ సీన్లను గుర్తు చేసుకుంటూ వెళ్తే బోలెడు.

శ్రెదేవి సోడా సెంటర్ లో పాజిటివ్ పాయింట్లు చూస్తే దర్శకుడు రాసుకున్న మాటలు ముందు వరుసలో వుంటాయి. సినిమాలో నాలుగు అయిదు ఆణిముత్యాల్లాంటి డైలాగులు దొర్లాయి. మిగిలిన చాలా డైలాగులు కూడా బాగున్నాయి అనిపించుకున్నాయి. అలాగే నటీనటుల దగ్గర నుంచి మంచి నటన తీసుకోవడం అన్నది రెండో ప్లస్ పాయింట్. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం మూడో ప్లస్ పాయింట్.

అయితే అదే సమయంలో అందుకు సరిసమానంగా మైనస్ పాయింట్లు కూడా వున్నాయి. రియలిస్టిక్ సినిమాలు వేటిలోనూ అంతగా హీరోయిజం వుండదు. కానీ ఈ సినిమాలో హీరోను ఎలివేట్ చేయడానికి, హీరోయిజం చూపించడానికి కాస్త ఎక్కువ ఆసక్తి కనబర్చారు అనిపిస్తుంది. ఉత్కంఠగా సాగాల్సిన బోట్ రేస్ అందంగా కనిపించింది తప్ప, ఆసక్తిగా కాదు. అక్కడ కూడా హీరో కండల ప్రదర్శనే. ఎంత డ్రామా చేస్తే విలనిజం అంత పండుతుందన్నది రావుగోపాలరావు కాలం నాటి వ్యవహారం. ఇప్పుడు కాదు. విలనిజం పండాలి అంటే కథలో దానికి తగిన స్కోప్ వుండాలి. శ్రీదేవి సోడా సెంటర్ లో విలనిజాన్ని బలవంతగా దూర్చినట్లు అనిపిస్తుంది.

సోడాల శ్రీదేవి లేదా లైటింగ్ సూరిబాబుల జీవితాలతో విధి ఆడుకుందా? కులాలు ఆడుకున్నాయా? ఈ రెండూ కలిపి ఆడుకున్నాయా? అనే విధంగా బలమైన సన్నివేశాలు, సంఘటనలు రాసుకుంటే అదివేరుగా వుండేది. అలా చేయకుండా కేవలం రొటీన్ సన్నివేశాలను బలమైన వాటిగా మార్చాలని, ప్రెజెంట్ చేయాలని చూసాడు దర్శకుడు. అదే అతి పెద్ద మైనస్. హీరోను ఆదిలోనే జైలు కు పంపేయడం అన్న ఆలోచనే కథలో అతి పెద్ద మైనస్. అలా కాకుండా బయటే వుంచితే మరిన్ని సీన్లు రాసుకునే అవకాశం వుండేది. జైలు నుంచి పారిపోయి వచ్చిన తరవాత, ఇంట్లోంచి పారిపోయిన తరువాత పెద్దగా సీన్లు రాసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.

సినిమాకు క్లయిమాక్స్ అన్నది ఆయువు పట్టు. హీరోయిన్ కు బలవంతపు పెళ్లి, శోభనం గదిలో ఆమె డైలాగులు దగ్గర నుంచి సినిమా ముగిసే వరకు దర్శకుడి పనితనం కనిపిస్తుంది. కానీ కేవలం ఈ పావు గంట కోసం రెండు గంటలకు పైగా రొటీన్ డ్రమెటిక్ సినిమాను చూడడం కష్టం కదా?

హీరో సూరిబాబుగా సుధీర్ బాబు బాగానే చేసాడు. చాలా కాలం తరువాత ఆనందని తెలుగు ప్రేక్షకులకు కనిపించి కనువిందు చేసింది. నరేష్ తో సహా ప్రతి ఒక్కరు బాగా నటించారు అనే కన్నా వాళ్ల దగ్గర నుంచి నటనను తీసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.

మొత్తం మీద శక్తి సామర్ధ్యాలు వున్న దర్శకుడు వాటిని కొంత మేరకు వినియోగించి, కొంత మేరకు వినియోగించని సినిమా శ్రీదేవి సోడా సెంటర్

ప్లస్ పాయింట్లు
క్లయిమాక్స్
నిర్మాణ విలువలు
టెక్నికల్ టీమ్

మైనస్ పాయింట్లు
రొటీన్ స్క్రిప్ట్

ఫినిషింగ్ టచ్ : గ్యాస్ తక్కువైంది

Rating: 2.5/5

This post was last modified on August 27, 2021 7:27 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

క్రేజీ సీజన్ వేస్టయిపోతోంది…

సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్‌ సెలవుల్లో వచ్చే రెండు…

9 hours ago

రాజా సాబ్ హీరోయిన్ మాట నమ్మొచ్చా!

వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…

9 hours ago

పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…

10 hours ago

డేంజర్ గేమ్ పార్ట్-2.. ఉత్కంఠకు సిద్ధమా?

అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…

10 hours ago

జమిలి వస్తుంది..మీ జగన్ గెలుస్తున్నాడు

‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…

10 hours ago

మా దెబ్బ ఇంకా బలంగా ఉంటుంది: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…

11 hours ago