దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐడీఎంకే) అలియాస్ అన్నాడీఎంకేతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ మేరకు బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి మధ్య ఈ ఒప్పందం కుదరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇటీవలే రాజీనామా చేసిన అన్నామలై సమక్షంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఈ పరిణామం తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకు కష్టకాలం తెచ్చినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోమారు సీఎం పదవి చేపడతానని ధీమాగా ఉన్న సీఎం ఎంకే స్టాలిన్ ఆశలపై ఈ పరిణామం నీళ్లు చల్లేస్తుందా? అన్న దిశగానూ విశ్లేషణలు సాగుతున్నాయి.
అన్నాడీఎంకేతో ఒప్పందం సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ పర్యాయం అన్నాడీఎంకేతో పొత్తుతో ముందుకెళ్లిన బీజేపీ… తమిళనాట ఏకంగా 30 లోక్ సభ స్థానాలను గెలిచిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా రెండు పార్టీల మధ్య కుదిరిన పొత్తుతో వచ్చే ఎన్నికల్లో తమిళనాట భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మేలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగానే సమయం ఉండగానే… వ్యూహాత్మకంగా సాగిన బీజేపీ, అన్నాడీఎంకేలు ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నాయని చెప్పాలి. రెండు పార్టీల మధ్య ఒప్పందం కంటే కూడా రెండు పార్టీల శ్రేణులు కలిసి సాగితేనే తమిళనాట ఎన్డీఏకు అధికారం దక్కే అవకాశాలున్నాయి. ఈ విషయంలో అన్నీ ఆలోచించుకునే ఇరు పార్టీలు… తమ రెండు పార్టీల శ్రేణులు కలిసి సాగేందుకు కొంత సమయం అవసరమన్న భావనతోనే ఏడాది ముందుగానే పొత్తుపై నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో డీఎంకేను అన్నాడీఎంకే నిలువరించే పరిస్థితులు అయితే లేవు. ఇతరత్రా చిన్నాచితక పార్టీలు ఉన్నా… డీఎంకేను అధికారం నుంచి దింపేంత స్థాయిలో ఆ పార్టీలు ప్రభావం చూపే ఛాన్స్ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్తగా తెరమీదకు వచ్చిన సినీ నటుడు దళపతి విజయ్ పార్టీ తమిళ వెట్రిగ కజగం (టీవీకే) ఎన్నికల ఫలితాలను ఓ మోస్తరుగా ప్రభావితం చేసే అవకాశాలు అయితే ఉన్నాయనే చెప్పాలి. అయితే అధికారంలో ఉన్నది డీఎంకే కాబట్టి… ఆ పార్టీ వ్యతిరేక ఓటును విజయ్ పార్టీ కొంతమేర చీల్చగలిగితే… డీఎంకేకు కలిసి వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నా… క్షేత్ర స్థాయిలోని అన్నాడీఎంకే శ్రేణులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే మాత్రం బీజేపీ, అన్నాడీఎంకేల విజయం ఏమంత కష్టం కాదని కూడా చెప్పాలి. మొత్తంగా బీజేపీ, అన్నాడీఎంకేల పొత్తు డీఎంకే విజయావకాశాలపై నీళ్లు చల్లుతుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on April 11, 2025 7:03 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత.. సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన…
ఆదిత్య ధర్.. ఇప్పుడు బాలీవుడ్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి…
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు తెలంగాణ…
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన, రైలు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. విజిబిలిటీ భారీగా తగ్గిపోవడంతో పలు విమానాలను దారి…