ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శుక్రవారంతో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారుకొలువు దీరింది. అప్పట్లో విజయవాడ శివారులో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్ర మానికి ప్రధాన మంత్రినరేంద్ర మోడీ సైతం హాజరయ్యారు. అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార ఘట్టం జరిగింది. ఇక. అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్కారు చేసిన పనులు.. దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నా యి. పెట్టుబడుల ఆకర్షణతోపాటు.. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా.. ప్రాధాన్యం పెరిగింది.
ముఖ్యంగా ఈ పది మాసాల కాలంలో వృద్ధి మరింత పెరిగి.. రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన విధానం ప్రదానంగా కూటమి సర్కారుకు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం 2.2 శాతం మేరకు వృద్ధి పెరిగినట్టు కేంద్రమే పేర్కొంది. ఇక, రాజధాని అమరావతి పనులను వడివడిగా చేపడతామని చెప్పినట్టుగానే.. కేంద్రం నుంచి సాయంతోపాటు.. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కూడా నిధులు సేకరించి.. ముందుకు సాగుతున్నారు.
ఈ నెల 13న అమరావతి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇదేసయమంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీంతో వెనుక బడిన జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.350 కోట్లు రేపో మాపో రాష్ట్ర ఖజానాకు అందనున్నాయి. పెట్టుబడుల విషయానికి వస్తే… పలు సంస్థలు ఇప్పటికే రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నాయి. ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా దాదాపు 2 లక్షల లోపు ఉద్యోగాలు, 3 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇక, సమస్యల విషయానికి వస్తే.. ప్రతిపక్షం నుంచి పెద్దగా పోరు లేకపోవడం.. ప్రజల్లోనూ చంద్రబాబు, పవన్ ఇమేజ్‌లు ఏమాత్రం బెసకపోవడంతో ప్రజల్లో కూడా మార్కులు పెద్దగా తగ్గిపోయినట్టు ఎక్కడా లేదు. అయితే.. సూపర్ సిక్స్ విషయంలో మాత్రం.. కొంత చర్చ సాగుతోంది. అయినప్పటికీ.. ఉచిత సిలిండెర్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, పదిమాసాల్లో మంత్రుల పనితీరుపై చంద్రబాబు మార్కులు వేయడం.. వారిని ఎప్పటికప్పుడు గ్రాఫ్ పెంచుకునేలా చేయడం వంటివి కూటమి సర్కారుకు కలిసివస్తున్న పరిణామాలు.
This post was last modified on April 11, 2025 3:04 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…