వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే రచ్చగా మారింది. తనను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా మీడియాకు కనబడేలా న్యాయమూర్తి ముందుకు తీసుకెళతారా? అంటూ ఆయన పోలీసులపై ఓ రేంజిలో ఫైరయ్యారు. తమాషా చేస్తున్నారా? అంటూ ఆయన పోలీసులపై చిందులేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మాధవ్ వెంట అరెస్టైన ఆయన అనుచరులను పోలీసులు కొట్టినట్టుగా మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వాళ్లను ఇష్టానుసారంగా కొట్టినా డిస్ క్లోజ్ చేయకుండా ఉన్నానని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ బహిష్కృత యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసుల అదుపులో ఉండగానే దాడి చేసేందుకు గురువారం మాధవ్ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాధవ్ తో పాటు ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు… వారిపై హత్యాయత్నం, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్ మాధవ్, ఆయన అనుచరులను రాత్రికి నగరపాలెం పీఎస్ కు తరలించారు. కేసులు కూడా అక్కడే నమోదు చేశారు. అనంతరం శుక్రవారం సాయంత్రం గుంటూరు కోర్టుకు వారిని తరలించారు.
ఈ సందర్భంగా మీడియా సమక్షంలోనే తనను కారు దింపేందుకు పోలీసులు యత్నించారు. అయితే కారు దిగేందుకు ససేమిరా అన్న మాధవ్… పోలీసులపై విరుచుకుపడ్డారు. ఏమనుకుంటున్నారు? తమాషానా? మా పిల్లలను అతిరాన కొడితే కూడా డిస్ క్లోజ్ చేయకుండా ఉన్నా. తమాషాలు చేస్తారా? నేనేమైనా దోపిడీ దొంగనా? పొలిటికల్ లీడర్ ను. ఎంపీగా పనిచేసిన వాడిని. ఈ దేశానికే ఎంపీగా పనిచేసిన వాడిని. పోలీసు ఆఫీసర్ ని. తమాషాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? అంటూ ఆయన ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్ చిందులేయడంతో పోలీసులు కారుకు డోర్ వేసి వేరే ద్వారం మీదుగా ఆయనను న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు.
This post was last modified on April 11, 2025 7:09 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…