Movie Reviews

సమీక్ష – సంక్రాంతికి వస్తున్నాం

పండగ పేరునే సినిమా టైటిల్ పెట్టుకుని రావడం అరుదు. అందులోనూ స్టార్ హీరో అంటే ప్రత్యేకమైన అంచనాలు నెలకొంటాయి. ప్రకటన స్టేజి నుంచే క్రేజ్ సంపాదించుకున్న సంక్రాంతికి వస్తున్నాం ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వెరైటీ ప్రమోషన్లతో నిత్యం ప్రేక్షకుల నోళ్ళలో నానేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఎంచుకున్న ప్రమోషనల్ స్ట్రాటజీ, భీమ్స్ ఇచ్చిన సూపర్ హిట్ ఛార్ట్ బస్టర్ పాటలు రిలీజ్ ముందే హైప్ పెంచేశాయి. గ్యారెంటీ వినోదం ట్యాగ్ తో వచ్చిన ఈ ఎంటర్ టైన్మెంట్ ఏ మేరకు నవ్వించిందో చూద్దాం.

కథ

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన పెద్ద కార్పొరేట్ సిఈఓ సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) కిడ్నాప్ కు గురవుతాడు. ఇది బయట పడితే ప్రమాదమని భావించిన ప్రభుత్వం ఈ ఆపరేషన్ కోసం సమర్ధుడైన పోలీస్ కోసం వెతుకుతుంటే ఉద్యోగం వదిలేసిన వైడి రాజు (వెంకటేష్) గురించి తెలుస్తుంది. అతన్ని ఒప్పించే తీసుకొచ్చే బాధ్యత మీను (మీనాక్షి చౌదరి) తీసుకుంటుంది. రాజమండ్రి దగ్గర చిన్న ఊళ్ళో భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేష్) తో ఇల్లరికం సెటిలైన రాజు కేసు గురించి తెలుసుకుని ఒప్పుకుంటాడు. అయితే దీని వెనుక కనిపించని రహస్యం, రాజుకో ఉన్నతమైన లక్ష్యం ఉంటాయి. అవేంటి, భార్య ప్రియురాలి మధ్య ఎలా నలిగిపోయాడనేది స్టోరీ.

విశ్లేషణ

రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను విసిగించకుండా ఎంగేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకునే దర్శకుడు అనిల్ రావిపూడి. తాను డీల్ చేస్తోంది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. సంక్రాంతికి వస్తున్నాంలో మెయిన్ పాయింట్ చాలా చిన్నది. సినిమా ప్రారంభంలో కిడ్నాప్ ఎపిసోడ్ తో సీరియస్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నప్పటికీ క్రమంగా దాన్ని నవ్వుల వైపు మళ్లించడం మీద దృష్టి పెట్టడంతో రెగ్యులర్ కమర్షియల్ అంశాలు పక్కకు వెళ్ళిపోయి ఒక చక్కని డ్రామా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. లౌడ్ కామెడీ లేకుండా సింపుల్ జోకులతో ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు రాసుకోవడంతో విసుగు ప్రసక్తే రాదు.

ఫస్ట్ హాఫ్ మొత్తం కాలక్షేపానికి లోటు లేకుండా గడిచిపోతుంది. ముఖ్యంగా వెంకీ కొడుకుగా నటించిన బుల్లిరాజు బూతులు కలిసిన జోకులు ఘొల్లుమనిపిస్తాయి. ఈ పిల్లాడి కాంబోని అందరూ ఎంజాయ్ చేస్తారు. అమాయకురాలైన భార్యని ప్రేమిస్తూ తోడల్లుళ్లను అవకాశం దొరికినప్పుడంతా ఏడిపించే రాజుగా వెంకటేష్ ఎక్కడిక్కడ నిలబెట్టుకుంటూ వెళ్లిపోయారు. పెద్దలకు మాత్రమే హాస్యం కొంచెం ఉన్నప్పటికీ ఎలాంటి అసభ్యత లేకపోవడం రావిపూడి తెలివికి నిదర్శనం. మేజిక్ ఉంటే లాజిక్ అవసరం లేదనే సూత్రాన్ని ప్రతి పావుగంటకోసారి గుర్తు చేస్తూనే ఉంటాడు. అందుకే ఇలా సాధ్యమవుతుందానే సందేహం రానివ్వకుండా మేనేజ్ చేసుకున్నాడు.

ఈవివి, జంధ్యాలని మిక్స్ చేస్తూ ఇప్పటి ట్రెండ్ కి సింక్ అయ్యేలా ఆలోచించడమే అనిల్ స్టయిల్. హై హై నాయక, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటివి రెఫెరెన్స్ గా తీసుకుని కొత్త తరం ఆడియన్స్ ని నవ్వించేలా చేయడంలో ఇతని శైలి మరోసారి బయట పడుతుంది.అలా అలా ఇంటర్వెల్ వరకు టైంపాస్ అవుతుంది. అయితే సెకండాఫ్ లో కొంత సమస్య వచ్చి పడింది. ఊరి నుంచి బయట పడి హైదరాబాద్ కు బయలుదేరే క్రమంలో పెట్టిన రోడ్ జర్నీ కామెడీ దగ్గర రావిపూడి తడబడ్డాడు. భార్య, మాజీ లవర్ మధ్య వెంకీ నలిగిపోయే ప్రహసనంతో కొంత కవర్ చేసే ప్రయత్నం జరిగినప్పటికీ జైలర్ ఎపిసోడ్, శవంతో ప్రయాణం కాస్త ల్యాగయ్యాయి.

మొదటి సగంలో కలిగిన భావనతో రెండో సగం అంతకు మించి ఉంటుందనే ఎక్స్ పెక్టేషన్ వల్ల అంత బరువు సెకండాఫ్ మోయలేకపోయింది. అయినా సరే కొన్ని వర్గాల ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసంతృప్తి భారాన్ని తగ్గించవచ్చు. సింగల్ ఆర్టిస్టు మీద ఆధారపడి ఎక్కువ స్పేస్ ఇస్తే ఒక్కోసారి రివర్స్ అవ్వొచ్చు. యానిమల్ తో పేరు తెచ్చుకున్న ఉపేంద్ర లిమయే విషయంలో ఇదే జరిగింది. సాయికుమార్ లాంటి నటుడిని చిన్న కానిస్టేబుల్ కి పరిమితం చేయడం కూడా డిజైనింగ్ లోపమే. కథా కథనాల విషయంలో ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉంటే సంక్రాంతికి వస్తున్నాం ఇంకా బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచేది.

కొంచెం బలహీనతల వైపు తొంగి చూస్తే విలన్ల థ్రెడ్ వీక్ గా ఉండటం ఒక లోపమే. కామెడీ సినిమాల్లో వీళ్ళు సీరియస్ గా ఉండరు కానీ ఇక్కడ హీరో రాజేంద్ర ప్రసాద్ కాదు వెంకటేష్. కాబట్టి కొంచెం ఎక్స్ ట్రా కోటింగ్ ఉండాల్సిందే. ఎమోషన్ కోసం స్కూల్ మాస్టర్ ని తీసుకొచ్చిన రావిపూడి చివర్లో దానికి ఎమోషనల్ టచ్ బాగా ఇచ్చాడు కానీ మధ్య మధ్యలో ఇలాంటివి మరికొన్ని ఉండి ఉంటే భావోద్వేగాలు బ్యాలన్స్ అయ్యేవి. బుల్లిరాజుని చివరి గంట వాడుకోకుండా వదిలేయడం మరో మైనస్. తనని మాస్ జనాలు బాగా ఎంజాయ్ చేసిన వైనం థియేటర్లలో కనిపించింది. కొన్ని పాత్రలకు సరైన కంటిన్యూటీ లేకపోవడం ఒకరకంగా ఇబ్బందయ్యింది.

కొన్న టికెట్ కి న్యాయం చేసి బోర్ కొట్టించకుంటే చాలని కోరుకుంటున్న ట్రెండ్ లో సంక్రాంతికి వస్తున్నాం నిరాశపరిచే ఛాన్స్ ఎంతమాత్రం లేదు. కాకపోతే ఎఫ్2, ఎఫ్ 3 మోతాదులో ఆశించకుండా ఉంటే బెటర్. నవ్విస్తే చాలు స్క్రీన్ ప్లే గట్రా మరీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనే సూత్రాన్ని పాటిస్తున్న అనిల్ రావిపూడి ఇదే మోడల్ ని సుదీర్ఘ కాలం కొనసాగించడం పెద్ద సవాల్. మరికొంత హోమ్ వర్క్ అవసరం చాలా ఉంది. మాస్ మసాలాలు లేకపోయినా జోకులతోనే చప్పట్లు ఈలలు వేయించుకునే సత్తా ఉన్న అనిల్ రావిపూడి మరింత బలమైన కంటెంట్ ఉంటే కనక భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఎంటర్ టైనర్లు తీయగలడు.

నటీనటులు

వెంకటేష్ కు ఇలాంటి పాత్రలు టైలర్ మేడ్. అందులోనూ అనిల్ రావిపూడి లాంటి వాడుకునే దర్శకుడు దొరకాలే కానీ ఫుట్ బాల్ ఆడేస్తారు. ఎఫ్2, ఎఫ్3లో ఆల్రెడీ ఋజువయ్యింది. సంక్రాంతికి వస్తున్నాంలో మరోసారి ఈ జంట నవ్వుల పంట పండించేసింది. ముఖ్యంగా భార్య దగ్గర ప్రియురాలి కబుర్లు దాచలేక తంటాలు పడే షేడ్ ని అద్భుతంగా పండించారు. కొన్ని మాములు సీన్లు హిలేరియస్ గా పండడానికి వెంకీ టైమింగ్ తప్ప వేరే కారణం కనిపించదు. క్లైమాక్స్ లో రౌడీలను చితకబడుతూ బ్రహ్మచారులకు, పెళ్ళైన భర్తలకు చెప్పే ప్రవచనాలు తనకు మాత్రమే సొంతమయ్యే టైమింగ్ లో వచ్చాయి. వైడి రాజుగా చితక్కొట్టాడు.

తమిళంలో సెటిలైనా తెలుగులో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఐశ్యర్య రాజేష్ భాగ్యం పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. వయసు వ్యత్యాసం ఎక్కువ కనిపించనీయకుండా అనిల్ డిజైన్ చేసిన ఈ జంట కెమిస్ట్రీ బాగా కుదిరింది. మీనాక్షి చౌదరికి సవాల్ అనిపించే రోల్ కాకపోయినా మాజీ లవర్ గా, పోలీస్ ఆఫీసర్ గా మంచి ఛాయస్ అనిపించుకుంది. బుల్లిరాజుగా మాస్టర్ రేవంత్ గుర్తుండిపోతాడు. ముఖ్యమంత్రిగా నరేష్, పార్టీ ప్రెసిడెంట్ గా విటివి గణేష్ హాస్యం బాగుంది. ఉపేంద్ర లిమయే కాస్త ఎక్కువే చేశాడు. సాయికుమార్, మురళీధర్ గౌడ్, పృథ్విరాజ్, శ్రీనివాస్ అవసరాల, పమ్మిసాయి, శ్రీనివాసరెడ్డి, సర్వదమన్ బెనెర్జీ తదితరులు తమకిచ్చిన పరిధి మేరకు కుదిరారు.

సాంకేతిక వర్గం

భీమ్స్ ఇచ్చిన మూడు పాటలు ఆడియో పరంగా ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయో తెరమీద చూసేందుకు కూడా అంతే కలర్ ఫుల్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మరీ గొప్పగా చెప్పేందుకు అవకాశం దక్కలేదు కానీ ఉన్నంతలో డీసెంట్ గా ఇచ్చాడు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణాన్ని బడ్జెట్ పరిమితులు కట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. విజువల్స్ మరీ గొప్పగా అనిపించవు. తమ్మిరాజు ఎడిటింగ్ వీలైనంతగా క్రిస్పీగానే ఉంచింది కానీ అంబులెన్స్ సన్నివేశాల ముందు వెనుకా ఇంకొంచెం కత్తెరకు పని చెప్పాల్సింది. దిల్ రాజు నిర్మాణ విలువలు జాగ్రత్తగా ఉన్నాయి. ఎంత ఖర్చు పెట్టాలో ముందే నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగానే డిజైన్ చేసుకున్నారు కాబోలు.

ప్లస్ పాయింట్స్

వెంకటేష్ టైమింగ్
ఐశ్యర్యరాజేష్ నటన
ఫస్ట్ హాఫ్ కామెడీ
పాటలు

మైనస్ పాయింట్స్

బలమైన కథ లేకపోవడం
పట్టుతప్పిన సెకండాఫ్ హాస్యం
విలన్ ట్రాక్
రెగ్యులర్ అనిపించే కొన్ని సీన్లు

ఫినిషింగ్ టచ్ : నవ్వులు పూయించాం

రేటింగ్ : 2.75 / 5

This post was last modified on January 14, 2025 8:06 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

నెట్ ఫ్లిక్స్ పండగ – టాలీవుడ్ 2025

ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాలను కొనే విషయంలో అలసత్వం ప్రదర్శించడం ఎంత పెద్ద తప్పో ఆర్ఆర్ఆర్ తర్వాత గుర్తించిన నెట్…

11 hours ago

జైలర్ 2 – మొదలెట్టకుండానే సంచలనం

ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లింప్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్…

12 hours ago

“సంతాన ప్రాప్తిరస్తు” నుంచి స్పెషల్ పోస్టర్

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్,…

13 hours ago

YD రాజు కాదు… వెంకీ అంటే ఫ్యామిలీ రాజు !

ఇవాళ విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ కి ట్రేడ్ నివ్వెరపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టడం చూసి…

14 hours ago

భారతీయుడు 3 భవిష్యత్తు ఏంటి?

థియేటరా ఓటిటినా అనేది పక్కనపెడితే భారతీయుడు 3 బయటికి రావడమైతే పక్కానే. కానీ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే…

14 hours ago

పెంచలయ్య మహా ముదురు… ఇన్ని సార్లా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పరకామణిలో వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ దొరికిపోయిన పెంచలయ్య వ్యవహారంలో షాకింగ్ నిజాలు…

16 hours ago