Movie News

ప్రభాస్ పెళ్లి కబురు చెప్పబోతున్నారా?

టాలీవుడ్లో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెళ్లి కబురు ఏది అంటే ప్రభాస్‌దే అనడంలో మరో మాట లేదు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44 ఏళ్లు కాగా.. దశాబ్దం కిందట్నుంచే తన పెళ్లి గురించి చర్చ జరుగుతోంది.

బాహుబలి టైంలోనే తన వివాహం గురించి జోరుగా చర్చ జరిగింది. ఆ సినిమా పూర్తి కాగానే ప్రభాస్‌కు పెళ్లి చేస్తామని కృష్ణంరాజు అన్నారు. కానీ ఆ మాట నిలబడలేదు. ‘బాహుబలి’ రెండు భాగాలు అయ్యాక వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడే తప్ప పెళ్లి ఊసే ఎత్తలేదు ప్రభాస్. తన అన్న కొడుక్కి పెళ్లి చేయాలని ఎంతగానో కోరుకున్న కృష్ణంరాజు ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు.

అంతకంటే ముందే ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు చర్చించుకోవడం మానేశారు. ఇక అతను వివాహం చేసుకోడేమోలే అని ఫిక్సయిపోయారు. కానీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం తన పెళ్లి విషయంలో అభిమానులను ఊరిస్తూనే ఉన్నారు.

కొన్ని నెలల కిందట శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి జరుగుతుందని, అంతా పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. తాజాగా విజయవాడలోని కనక దుర్గమ్మ గుడికి వచ్చిన శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి త్వరలోనే తీపి కబురు చెప్పబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆమె ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ వివాహం గురించి ప్రశ్నలు ఎదురు కావడం మామూలే. ఇక్కడా అదే జరిగింది. దానికామె బదులిస్తూ.. త్వరలోనే దీని గురించి ప్రకటన వస్తుందంటూ అభిమానులను ఊరించారు.

ఐతే మీడియా వాళ్లకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇలా పాజిటివ్‌గా మాట్లాడిందా.. లేక నిజంగానే ప్రభాస్ పెళ్లి ఫిక్సయిందా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి వార్త త్వరలోనే బయటికి వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్.. రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇంకా అతను స్పిరిట్, సలార్-2, కల్కి-2 సినిమాలు చేయాల్సి ఉంది.

This post was last modified on October 15, 2024 4:45 pm

Share

Recent Posts

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

10 minutes ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

10 minutes ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

2 hours ago

సంపూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…

3 hours ago

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

4 hours ago

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

6 hours ago