మెగాస్టార్ చిరంజీవి హీరోగా వసిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర టీజర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ముందు ప్రకటించిన జనవరి 10 రిలీజ్ డేట్ ని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం త్యాగం చేయాల్సి రావడం ఫ్యాన్స్ ని కొంత భాదించినా అది చిరు తనయుడి కోసమే కాబట్టి సర్దిచెప్పుకున్నారు. హైదరాబాద్ విమల్ 70 ఎంఎం థియేటర్ లో జరిగిన లాంచ్ ఈవెంట్ కు వశిష్టతో పాటు నిర్మాత విక్రమ్, కెమెరామెన్ చోటా కె నాయుడు తదితరులు హాజరయ్యారు. తొంభై సెకండ్లకు పైగా ఉన్న వీడియోలో విశ్వంభర ప్రపంచం ఎలా ఉండబోతోందో కొన్ని విజువల్స్ తో పరిచయం చేశారు.
చీకటిలో రాజ్యమేలడానికి ఒక అరాచక శక్తి పూనుకున్నప్పుడు విశ్వానికి వెలుగు తేవడం కోసం ఒక యోధుడు పూనుకుంటాడు. అతనే విశ్వంభర. వందల వేల సంవత్సరాల నాటి నేపథ్యంతో పాటు ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ని బలంగా జోడించిన వశిష్ట తెల్లని గుర్రం మీద చిరంజీవిని చూపించడం, ఆంజనేయ స్వామి విగ్రహం ముందు గూండాలను చితకబాదడం లాంటి సన్నివేశాల ద్వారా ఇటు క్లాస్ అటు మాస్ ఇద్దరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం స్పష్టమయ్యింది. కొన్ని సీన్లు అవతార్ తరహాలో అనిపించినప్పటికీ మంచి స్టాండర్డ్ లో విఎఫెక్స్ ని తీర్చిదిద్దిన వైనం తెరపై కనిపించింది.
అంచనాలను ప్రాధమికంగా ఏర్పరచడంలో విశ్వంభర బృందం సక్సెసయ్యింది. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చోటా కె నాయుడు ఛాయాగ్రహణం కాన్సెప్ట్ ని బాగా ఎలివేట్ చేశాయి. ఇది ప్రమోషన్లలో తొలి అడుగే కాబట్టి ఇప్పుడే నిర్ధారణకు రాలేం కాబట్టి ట్రైలర్, పాటలు వచ్చాక కంటెంట్ మీద ఒక అవగాహన వస్తుంది. త్రిషతో సహా ఇతర కీలక ఆర్టిస్టులు ఎవరినీ రివీల్ చేయలేదు. విలన్ ని సైతం ఫాస్ట్ షాట్స్ లో లాగించేశారు. మే నెల విడుదలకు ప్లాన్ చేసుకుంటున్న విశ్వంభర తేదీని ఇప్పుడప్పుడే ప్రకటించకపోవచ్చు. హరిహర వీరమల్లు మార్చి 28 వస్తుందా లేదానే దాని మీద ఆధారపడి ఉంటుంది.
This post was last modified on October 12, 2024 12:27 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…