బలగం తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చినా ఎల్లమ్మ స్క్రిప్ట్ మీదే పని చేసిన దర్శకుడు వేణు యెల్దండి దాన్ని న్యాచురల్ స్టార్ నానితో తెరకెక్కించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ కార్యరూపం దాల్చలేదు. పలు సందర్భాల్లో దీని ప్రస్తావన వచ్చినప్పుడు నాని తనకు వేణు అంటే చాలా ఇష్టమని, భవిష్యత్తులో కలిసి పని చేస్తామని అన్నాడు తప్పింది అది ఎల్లమ్మ అయితే కాదు.
నిర్మాత దిల్ రాజుకి బాగా నచ్చిన కథ ఇది. అందుకే వేరే ప్రొడక్షన్ హౌస్ కి పంపకుండా వేణుని లాక్ చేసుకున్నారు. నిన్న జనక అయితే గనక ప్రెస్ మీట్ లో మరోసారి ఎల్లమ్మ గురించి డిస్కషన్ వచ్చింది. ఎప్పుడు మొదలుపెడదామని దిల్ రాజు అడిగితే మీరు అడిగితే, రేపే నవంబర్ లో షూటింగ్ చేద్దామని వేణు అనగా, దానికి నవ్వుతూ దిల్ రాజు ఫిబ్రవరిలో షురూ చేద్దామని చెప్పడంతో టాపిక్ ముగిసింది.
అయితే ఇప్పుడు అసలు సస్పెన్స్ ఎల్లమ్మ హీరో ఎవరనేది. నాని కాదనే క్లారిటీ వచ్చేసింది. ఇదే కథ నితిన్ కు చెప్పారని మరో టాక్. ఒప్పుకున్నాడో లేదో తెలియదు. దిల్ రాజు బ్యానర్ లోనే వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ప్రస్తుతం తమ్ముడు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనికీ ఎస్ అంటాడో లేదో చూడాలి. ఒకవేళ కాదంటే నెక్స్ట్ ఆప్షన్ ఎవరై ఉండొచ్చనే దానిలో శర్వానంద్ పేరు వినిపిస్తోంది.
క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగి చూడక తప్పదు. పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఒక రియల్ లైఫ్ పీరియాడిక్ డ్రామాగా ఎల్లమ్మ ఉంటుందని వినికిడి. ఇమేజ్ ఉన్న హీరో అయితేనే రీచ్ ఉంటుందని భావించి ఆ కారణంగానే ఇన్ని నెలలు ఎదురు చూసినట్టుగా తెలిసింది. దిల్ రాజు సైతం కంటెంట్ మీద నమ్మకంతో అతను కోరిన హీరోల కోసం ట్రై చేశారట. బలగం లాంటి హై ఎమోషన్ పండించిన వేణు ఈసారి అంతకు మించి ఇస్తాడని మూవీ లవర్స్ ఎదురు చూడటం సహజం. దానికి తగ్గట్టుగానే పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో పాటు పెద్ద బడ్జెట్ కావాలి. దానికి ఎస్విసి సంస్థనే కరెక్టని వేరే చెప్పాలా.